ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నిద్ర లేమికి మందు - పి . కమలాకర్ రావు
September 16, 2020 • T. VEDANTA SURY • health tips

అప్పుడప్పుడు మానసిక బాధ ఎక్కువైనప్పుడు నిద్రరాని పరిస్థితులు ఏర్పడుతాయి. దీనికి మనం మనసును కుదుట పరచుకుని కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే నిద్ర వస్తుంది. అరటి పండు గుజ్జులో కొద్దిగా జిలకర పొడి + తేనే కలిపి తిని , కొద్దిగా పాలు కూడా తాగి పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. గుత్తి వంకాయ కూరలో పల్లి పొడి వేసి (వేరు శనగలు ) అందులో ఎక్కువ మోతాదులో ధనియాల పొడి కూడా వేసి రాత్రి పూట భోజనం చేస్తే తప్పకుండ నిద్ర పడుతుంది. గోరింటాకు ( మైదాకు ) ను ముద్దగా నూరి కొబ్బరి నూనెలో వేసి తైలంగా కాచి వడబోసి చల్లారిన తరువాత తలకు మర్దనా చేస్తే మంచి నిద్ర వస్తుంది.