ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నిప్పెలా వచ్చింది: -- జగదీశ్ యామిజాల
October 27, 2020 • T. VEDANTA SURY • Story

ఆకాశంలో ఉన్న పిడుగు దేవత దగ్గర మాత్రమే నిప్పు ఉండేది. 

మెరుపు కోత కోసినప్పుడు ఆ వెలుగు కనిపించడాన్ని భూమ్మీది ప్రజలు చూసారు. 

ఎలాగైనాసరే పిడుగుదేవుడికి తెలీకుండా నిప్పుని దొంగిలించాలనుకున్నారు ప్రజలు. ఇందుకోసం మావోక్ అనే కుర్రాడిని ఆకాశానికి పంపారు. 

ఆ కుర్రాడు పిడుగు దేవుడి ఇంట దాక్కుని నిప్పెలా తయారవుతోందో గమనించాడు. 

పిడుగు దేవుడి వద్ద ఎన్నోళబాణాలు ఉండటం చూశాడు. అవి ఒక దానితో ఒకటి రాసుకుంటున్నప్పుడు నిప్పు పుట్టడం తెలుసుకున్న మావోక్ వెంటనే రెండు బాణాలను దొంగిలించుకుని భూమ్మీదకు తిరుగు ప్రయాణం చేశాడు. మార్గమధ్యంలో ఓ పర్వతం మీద ఆగాడు.

ఇది తెలుసుకున్న పిడుగు దేవుడు ఆ బాణాల నుంచి నిప్పు పుట్టకుండా శపించాడు.

మావోక్ ఓ పర్వతం మీద నిల్చుని ఒక బాణంతో మరొక బాణాన్ని గీస్తూనే ఉన్నాడు. కానీ నిప్పు పుట్టడం లేదు. 

అతనికి వయస్సు ఎక్కువైపోతోంది తప్ప ఫలితం శూన్యం.

జుత్తంతా నెరిసిపోయింది. అయినా తన ప్రయత్నాన్ని మానలేదు.

చివరకు పిడుగు దేవుడు కరుణించి అతని బాణాల రాపిడిలో నిప్పు పుట్టేలా చేశాడు. 

ఆ విధంగా నిప్పు భూమికి వచ్చింది.

అయితే తామున్నది ఆకాశంలోనే కదా అనే కారణంగా నిప్పు ఎప్పుడూ ఆకాశాన్ని చూస్తూనే వెలుగుతుంటుంది.
(అలస్కాలో ప్రచారంలో ఉన్న కథ ఇది)