ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నియమం--కె ఎస్ అనంతాచార్య
September 13, 2020 • T. VEDANTA SURY • Poem

గంట వినపడితే
బిల బిలమంటూ
ప్రార్థనలో  వచ్చి నిలబడే
పిల్లజవాను లు!

దృఢ సంకల్పం తో
సిద్దాoతానికి కట్టుబడి
నిబద్ధత తో అనువర్తనాన్ని కొలిచే 
కొలబద్ద!

బలహీనతకు బానిస కాకుండా స్వప్రయోజనాల పక్కనుంచి సాగిపోయే
కర్మ నిష్ఠత, కర్తవ్య పరాయణత

యతి మైత్రి కుదరని
పద్యం ఛందోభంగమైనట్లు
సమయ స్ఫురణలేని
జీవన విధానం  క్రమ భంగం
ఔతుంది!

ఒడుదొడుకులను అధిగమి స్తూ
ఓరిమిని  పూసుకుని విజయం కోసం ఏర్పరచుకొన్న
యుద్ధ తంత్రవిద్య!

ఋతువులు
ధర్మం తప్పవు
మనిషి చేయి చేసుకుంటే తప్ప
పంచభూతాలు ఎదురు తిరిగితే
పంచ ప్రాణాలు కోల్పోయే 
ప్రమాదం అంచున మనిషి!

ధర్మ నియతి
తప్పడమంటే
నిప్పుతో చెర్లాడటం!


క్రుంగ దీసే శల్య సారధ్యం కాదు
సత్యవరిష్టుడిని చేసి
విశిష్ట స్థానం అందించే
కృష్ణ మార్గం!

దోషులు తప్పించు కోకుండా , 
బాధితులకు అండగ నిలిచే
 అధిపతి తీర్పు ! 

నియమం కలిగిన
జీవనం
ముడుతలు పడని 
అందమైన వదనం