ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నిలిస్తేచాలు!!--కె ఎస్ అనంతాచార్య
October 14, 2020 • T. VEDANTA SURY • Poem

నవ్వడం ఎప్పుడో మరిచిపోయాం భయం అంచున జీవితాన్ని తెల్లార్చుతూ వేగుచుక్క కోసం ఎదిరి చూపు

పక్క ఇంటి పలకరింపు లు లేవు పౌడర్, సెంట్లు కొట్టుకొని అంతా బాగున్నాం  లోన మంట, పైన చెమట అయినా మాట్లాడే ఆర్ట్ ఆఫ్ కల్చర్

కల్సుకొనడం ఇప్పుడేట్లాగూ వీలుకాదు ఎక్కడినించో కరోనా దూకుడు కప్ప మీద దుంకుతుoది 

మహావిపత్తు గజ గజ లాడిస్తున్న వేళ దిగులును దిగమింగలేక అడుగులు ఘనీభవించాయి

యోగాతో భోగాలనుభవం 
యోగం కలిసివచ్చే పంచాగం  లెక్కల కోసం  తిప్పలు !

సహజత్వం కృత్రిమత్వపు సాలెగూడు లో చిక్కింది!

సాహితీ సభలన్నీ జూమ్ ధామ్ లో జోరందుకున్నాయి అయినా తూర్పున మొలిచిన పద్యాలు వేదిక మీదే ఆవిష్కరింపమoటున్నాయి

అక్షరాలిప్పుడు ఆన్ లైన్లో మాట్లాడుకుంటున్నాయి తమ టీచేరెప్పు డు క్లాసులో కలుస్తాడని

పండుగలు,పబ్బాలు
అన్నీ గృహ మాధ్యమంలో జరిగే నిర్బంధ  సంబరాలు

  ప్రతిక్షణం పిరికితనo తో 
 ఉరుకులు పరుగులు
వైకుంఠ పాళీ చేరుతుందో పామే మింగుతుoదో ?

తుఫాను లెన్నోచ్చినా ఫర్వాలేదు 
జీవి సృజియించే సునామి తప్ప

రిక్టర్ స్కెల్ మీద భూకంపం పొడుగు పెరిగినా పల్స్ ఆక్సీమీటర్ స్కెలు పై నిలిస్తే చాలు