ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నీలి తోడేలు(రెండవ తరగతి చిన్నారుల కోసం గుణింతాలతో కథ) - డా.ఎం.హరికిషన్
August 21, 2020 • T. VEDANTA SURY • Story

 ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం ఒక ఊరిలోకి పోయింది.
ఆ తోడేలు ఆహారం కోసం వెదుకుతా... వెదుకుతా... పొరపాటున కాలు జారి ఒక నీలంరంగు కలిపిన బానలో పడిపోయింది. దాంతో ఆ తోడేలు ఒంటికంతా బాగా నీలం రంగు అంటుకొంది. 
ఆ నీలంరంగు ఎంతకీ వదలక పోవడంతో అలాగే తిరిగి అడవికి చేరుకొంది. ఆ తోడేలుని చూసి  అడవిలోని జంతువులు ఇదేమి ఇలా నీలం రంగులో తళతళ మెరైసిపోతా ఉంది. ఇంతకుముందు ఇలాంటి జంతువును చూడలేదే అని భయపడి పోయాయి. 
అది గమనించిన ఆ తోడేలు “మీరు ఏమీ భయపడకండి. నన్ను ఈ అడవికి రాజుగా ఆ దేవుడు పైనుంచి పంపించాడు. ఆకాశం నుంచి రావడంతో అదే రంగు నా ఒంటి మీద కూడా ఉంది ” అని చెప్పింది. జంతువులు దాని మాటలు నిజం అనుకొని దానిని రాజుగా చేశాయి. ఆ రోజు నుంచీ ఆ తోడేలు హాయిగా కాలు మీద కాలు వేసుకొని ఏ పనీ చేయకుండా బతకసాగింది. జంతువులు ఆ తోడేలు ఎలా చెబితే అలా నడుచుకోసాగాయి. దానికి మూడు పూటలా కావలసిన ఆహారం అందించసాగాయి.
అలా ఆరు నెలలు గడిచిపోయాయి.
ఒక రోజు అడవిలో చాలా రోజులకు మంచి వాన కురవసాగింది. జంతువులు సంబరంగా వానలో ఎగురుతూ పాటలు పాడుతూ చిందులు వేయసాగాయి. తోడేలు అది చూసి మైమరచి పోయింది. ఆనందంతో అది కూడా వానలో ఎగిరసాగింది. ఆ వానకు తోడేలు ఒంటిమీది రంగంతా కారిపోయి అసలు రూపం బైటపడింది. అది చూసిన జంతువులు అరెరే... ఇది దేవుడు పంపిన జంతువు కాదు. మన తోడేలే. ఇంతకాలం నీలం రంగు పూసుకుని అందరినీ మోసం చేసింది. ఇలాంటిది ఇకపై మన అడవిలో ఉండకూడదు అంటూ కోపంతో ఆ తోడేలుని అడవి నుండి తరిమి వేశాయి.
--డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212