ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నీవు లేక నేను లేను ..: ---మొహమ్మద్ . అఫ్సర వలీషా--ద్వారపూడి (తూ గో జి )
November 18, 2020 • T. VEDANTA SURY • Poem

1) ఊహలను సిరాలో పోసి
కాగితం పై అద్దా
అద్భుత భావాలు 
పండాయి.....

2) కలానికి కాగితానికి
అవినాభావ 
సంబంధం 
నీవులేక నేనులేనని....

3)నాలుగు సిరా
 చుక్కలు చాలు
అక్షరాలతో అల్లి బిల్లి 
ఆడటానికి.....

4)కత్తి కన్నా
 కలం గొప్పదే
ఎదుటి వారిని 
హింసించ నంత వరకు....

5)ఓ కవీ తోడు లేరని 
భాధ పడకు
రాస్తుండు
తోడొస్తా కడవరకు .....

6) కలం కాగితానిది
విడదీయరాని ప్రేమ 
ఒక్క క్షణం 
విడిచుండవు .....

7)  సిరా విత్తులతో 
సేద్యం చేయి కాగితం పై 
అద్భుత అక్షర 
పంటనిస్తుంది....

8)కలం సేదతీరుతున్నది
అక్షరాల లాలనలో
కాగితంకు
అద్దుకుని ....

9) సిరాకు తరతమ
 లేదు హరివిల్లు 
వర్ణాలద్దడానికి 
కలమేదైనా.....

10) కాగితం 
మిడిసిపడుతున్నది
తను లేనిదే
కలం కదలదని....

11)అక్షరం
ఉవ్విళ్ళూరుతున్నది
కాగితంతో నెయ్యమందాలని
 కలం సాక్షి గా....

12)కలానికి 
తీరని కోరిక 
అందరి చేతిలో 
అలరారాలని......