ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నేటితీరు ...!!--శ్రీమతి చిట్టె మాధవి--కడప+919398330214.
October 13, 2020 • T. VEDANTA SURY • News

చదువురాలేదనో..ఫెయిల్ అయ్యామనో.. ప్రేమ విఫలం..అయ్యిందనో  నిరుద్యోగం కృంగిపోవడం
భర్త తిట్టాడని...కొట్టాడని..భార్య చెప్పిన మాట వినలేదని..పెళ్ళాం కాపురానికి రాలేదని..పిల్లలు చూడలేదని తల్లితండ్రులు..తల్లితండ్రులు పట్టించుకోని పిల్లలు..ఆత్మనూన్యతతో..కొందరుఆర్థిక ఇబ్బందులతో ఇంకొందరు..మానసిక దౌర్బల్యంతో మరికొందరు ఎందుకు బలవర్మర్ణాలకు పాలుబడుతున్నారు... అని విశ్లేషించుకుంటే..ఇదో సంక్లిష్ట మనోసమస్యల వలయం.సమస్యలేని మనిషి...చావులేని  ఇండ్లు ఉండదు..అనేది నానుడి.

                     .పురోభివృద్ధికై ఎన్నో ఎత్తుపల్లాలను చూచివుంటారు...మరెన్నో విజయాలను చవిచూచి వుంటారు. ఎన్నో మానసిక సంఘర్షణలను ఎంతో  దైర్యంతోనే ఎదుర్కొనివుంటారు. కానీ నేడు ఇలా తన జీవితానికి ఓటమిని అపాదించుకొని ఆత్మహత్య చేసుకోవడం..జీర్ణించుకోలేని విషయం...
అందరిని విషాదంలో ముంచేసి తన జీవితానికి ముగింపు  పత్రం వ్రాసుకుంది మాత్రం వారి
సున్నితమైన మనస్తత్వమే...అనేది మాత్రం నిర్విదాంశము..!
  
           శారీరక దౌర్బల్యం....కన్నా మానసిక దౌర్బల్యం ఎంతో ప్రమాదకరమైనది.దీనిని సరైన సమయంలోనే గుర్తించాలి లేకపోతే అనేక అవాంఛిత  చేదు సంఘటనలు జీవితంలో ఎదుర్కొనవలసి వస్తుంది.శారీరిక బలహీనుడైనా
మానసిక దృడిలో... గట్టివారు జీవితంలో..తమ జీవనంలో విశిష్ట శైలిని అవలంబించి యావత్తు ప్రపంచానికి ఒక మహోన్నత వ్యక్తిగా దర్శనమిచ్చినవారు వున్నారు.వారిలో జాతి యావత్తుకు  జాతిపితగా మారి జాతికంతా దార్శనీయుకుడైనాడు...ఆయనే మహాత్మా గాంధీ గారు.అలాంటి కోవలోకే వచ్చే మరో అరుదైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అమరజీవి పదానికి జీవంపోసి...తన జీవన కవనాన్ని సమిధగా మార్చి..ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం తర్పణ చేయడం తృణపాయేమని తేల్చి చెప్పిన మహానుభావుడు..!

                 జీవితంలో గెలుపు ఓటములు రెండూ సమానమే..గెలుపుల, సంతోషాల్లో పొంగిపోవడం ఓటమిలో, కష్టాల్లో కృంగి పోవడం..సహజమైన మానసిక భావనలే... కానీ ఆ తీవ్రత నుండి  తొందరగా  బైటికి రావడమనే చోటనే...ఇన్ని  జీవన అపశృతులు జరుగుతున్నాయి.
ఓదార్పే ఉసురు మంటున్న ఈవేళలో...           పిల్లలకు పాఠాలతో పాటూ మానసిక వికాసపు తరగతుల యొక్క ఆవశ్యకతను నిత్యం మనచుట్టూ జరిగే సంఘటనలు గుర్తుచేస్తూనే ఉన్నాయి ..కానీ మనమే దానిని సరిగ్గా గుర్తించడం లేదు.దీనిని గుర్తించి ప్రతి ఒక్కరూ భాగస్వాములై..జీవిత అలసత్వ .. విపరీత దోరణీలను పారద్రోలాలి. చావాలంటే ఎంతో  దైర్యం కావాలి....దీనినే బ్రతకడానికి ఉపయోగిస్తే..జీవితం అద్భుతంగా ఉంటుంది. బ్రతికి ..మనం ఎందరికో బ్రతుకునివ్వొచ్చు..
ఎవరికి తెలుసు..ఆ బలహీన క్షణం నుండి బైటికి వస్తే...అద్భుతాలు సృష్టించొచ్చేమో ...! 
ఆవేశాలకు దూరంకండి..ఆత్మీయతను పంచండి.
ఇకనైనా...ఆలోచించండి.. 

మార్పు ఎక్కడ కావాలో..
ఎలా రావాలో... 
ఎందుకోసం  రావాలో..!
ఎవరి కోసం రావాలో...!!
ఘనీభవించిన భాధలన్నీ 
కన్నీరై ద్రవీభవింపక మానవు ..
చెంపల చెలిమి కై ...
చేతుల ఆత్మీయ స్పర్శకై...
ఒకరికి ఒకరు...గా..
ఒకరై....మరెందరికో స్ఫూర్తిగా...
నలుగురి లో బ్రతుకుతూ...
నలుగురితో సాగుతూ....
జీవన స్రవంతికి...నిత్య జీవమై..
తరలిపోవాలి...క్రొత్త తరానికి వారధిగా..!