ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నేను ఒంటరినా.---- యామిజాల జగదీశ్
September 7, 2020 • T. VEDANTA SURY • Story

హిమాలయాలలో ఓ యోగి సంచరిస్తున్నారు. ఆయన ఓ రోజు ఓ అపురూపమైన పువ్వుని చూస్తారు. ఆయన అంతకుముందెన్నడూ అటువంటి అందమైన పువ్వుని చూడలేదు. ఆయన ఆశ్చర్యంతో ఆ పువ్వును చూస్తూ చాలాసేపు అక్కడే గడుపుతాడు. ఆయనలో ఎనలేని ఆనందం. దాంతో ఉండబట్ట లేక ఆ యోగి పువ్వుని అడుగుతాడు...
"పువ్వా! నీలాంటి అందమైన పువ్వుని ఇప్పటివరకూ చేడలేదు.అటంవంటి నువ్వు ఇలా ఒంటరిగా ఉండటమేంటీ? పది మందిలో ఉండాలనిపించడంలేదా?" అని.
అప్పుడా పువ్వు "పిచ్చివాడా!  నేను ఒంటరిగా ఉండటమేంటీ? ఎత్తయిన హిమాలయాలలో ఉన్నాను. ఎన్ని రకాల చెట్లో ఇక్కడ....అనేక రకాల పువ్వులు...  నీలి ఆకాశం......వర్షం...ఎండా... ఎందరో సిద్ధులు ఇటు వచ్చి పోతుంటారు....నా చుట్టూ ఇన్నుంటే నన్ను ఒంటరిగా ఉన్నావని ఎలా ప్రశ్నించావు? నీకు ఒంటరితనం అంటే అర్థం తెలీదా?" అంటుంది.
గమనిక
ఈ విషయం నేను యూ ట్యూబ్ ఛానల్ లో ఓ ప్రముఖ తమిళ రచయిత సిద్ధుల గురించి చెప్పగా విన్నాను. ఆయన యోగి పేరు కూడా చెప్పాడు. కానీ నాకది గుర్తుకు రాకపోవడంతో యోగి పేరు పేర్కొనలేదు. ఒక యోగి అని చెప్పాను.