ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నైతిక వికాస సూత్రాలు- సాకి, కరీంనగర్
October 27, 2020 • T. VEDANTA SURY • Poem
16.
దానమే చేతికి అలంకారం
శాస్త్రమే చెవులకి అలంకారం
సత్యమే కంఠానికి ఆభరణము
వ్యక్తిత్వమే మనిషికి ఆభరణము
17.
రేపటిపని ఈరోజే చెయ్యాలి
ఈరోజుపని ఇప్పుడే చెయ్యాలి
మృత్యువు ఇప్పుడే రావొచ్చు
ఊపిరి ఇప్పుడో ఆగిపోవొచ్చు
18.
పరస్త్రీ కన్నతల్లితో సమానం
పరధనము మట్టితో సమానం
సనాతన ధర్మం దాటకెప్పుడు
సాధారణ ధర్మం మరువకెప్పుడు
19.
మితాహారం తనువుకి మేలు
మితభాషణం మనస్సుకి మేలు
మితమే అన్నింటా శ్రేయస్కరం
అమితం అన్నిటికి తిరస్కారం
20.
అల్పులతో స్నేహం అల్పబుద్ధినిచ్చు
ఉన్నతులతో స్నేహం ఉన్నతబుద్ధినిచ్చు
సత్సాంగత్యం సతతమ్ము పాటించు
దుస్సాంగత్యం కలలోనైనా దహించు