ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నైతిక వికాస సూత్రాలు-2---సాకి-కరీంనగర్.
October 13, 2020 • T. VEDANTA SURY • Poem

6.
నేను బాగుంటే చాలనుకోవద్దు
అందరు బాగుండటం ముద్దు
అందరిలో నీవున్నావని మరువకు
అందరికై ఆలోచించటం విడువకు
7.
పరులకోసం చెట్లు పళ్ళనిస్తున్నాయి
పరులకోసం నదులు నీళ్ళనిస్తున్నాయి
పరులకోసం బ్రతకటమే పరమార్థం
పరులకోసం నిలవటమే జీవితార్థం
8.
సుఖదుఃఖాలు సమానం జీవితాన
మానావమానాలు సమానం జీవితాన
అన్నింటా సమబుద్ధితో సాగిపొమ్ము
గీతాసారం బోధనలో నిలిచిపొమ్ము
9.
వ్యాయాయం చేయి శరీరానికి
ధ్యానం అలవర్చుకో మనస్సుకి
ఆరోగ్యమే భాగ్యమ్మని మరువకు
అనునిత్యం ఆచరణని మరువకు
10.
ప్రయత్నం లేకుంటే అసాధ్యం
ప్రయత్నిస్తే సర్వమూ సాధ్యం
ప్రయత్నంతో  ఫలితం సిద్ధించు
ప్రయత్నంచి సకలం సాధించు