ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పంచేసెయ్--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 6, 2020 • T. VEDANTA SURY • Poem

నడవడానికే కాళ్ళున్నాయ్
చూడడానికే కళ్ళున్నాయ్
నమలడానికే పళ్ళున్నాయ్
రాయడానికే వేళ్ళున్నాయ్
గురుదేవులకు మొక్కేసెయ్
విద్యలన్నీ  నేర్చేసెయ్
దేశసేవ  చేసేసెయ్
ఆనందాలు  పంచేసెయ్!