ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పంటి నొప్పులు - నివారణలు -- అడవి యాలకులు దంత వ్యాధుల్లో చాలా ఉపయోగ పడతాయి. ఇవి మనకు బజారులో కొన్ని సూపర్ బజారు షాపుల్లో లేక ఆయుర్వేద షాప్ లలో లభ్యమవుతాయి. కొన్ని అడవి యాలకులు తెచ్చి కడిగి నీటిలో వేసి అందులో కొన్ని లవంగాలు కూడా కలిపి మరిగించి చల్లార్చి తాగితే పంటి నొప్పులు త్వరగా తగ్గి పోతాయి. కాఫీ పొడిలో కొద్దిగా ఉప్పు + వంట సోడా కలిపి పళ్ళు తోముకుంటే పంటి నొప్పులు తగ్గుతాయి. ఆవాలను కొద్దిగా వేయించి పొడిగా చేసి కొద్దిగా ఉప్పు కలిపి పళ్ళపై రుద్దితే పంటి నొప్పులు పోతాయి. అలాగే వామును వేయించి పొడిగా చేసి ఉప్పు కలిపి పళ్ళపై రుద్దితే పంటి నొప్పులు పోతాయి. - పి . కమలాకర్ రావు
July 26, 2020 • T. VEDANTA SURY • health tips