ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పండుగ_ముచ్చట్లు- సరోజ పోచమల్లు
October 5, 2020 • T. VEDANTA SURY • Memories

ఇగ గియాల్లో గొంత ముచ్చట సెప్త నుల్లా.
గి పండుగ అంటేనే ఆడి పొలగాండ్ల పండుగాయే. మన కాడ ఏ పండుగైన ,పబ్బమైన,పబోజనం అయిన,ఇంట్ల ఏదన్నా కార్యం సేసుకున్న ఇంట్ల ఆడి పొలగాండ్లకు ముందు గాల కొత్త బట్టలు కుట్టిచ్చుడే..
ఇగ ఆడి పొలగాండ్ల అయ్య,అవ్వలు సుత మా పొల్ల నలుగుట్లకు పొయ్యి ఆడేదాయే.పెయ్యి మీద కొత్త పేగులు లేకుంటే ఎట్ల నని  ఏడనన్న తండ్లాడి కొత్త బట్టలు కుట్టిచ్చేది.ఇగ ఆ ఆడి పొలిగాండ్లు సుత తోటోళ్లు ఎవలన్న కొనుకుంటే ఓ..అయ్యో ఆల్లంతా కొత్త బట్టలు కొనుకున్నరే నాకు ఎప్పుడు కొంటవ్ ఇగ లొల్లి ,లొల్లి జేసేది.
ఇగ మా ఆడోళ్లకు మనసంతా నగల మీద సీరెల మీదనే వుంటాదాయే.ఇగో గిక్కడనే పెండ్లాం,మొగనికి జౌడాలు అయ్యేది.
మన ఆడోళ్లకు ఇంట్ల ఉన్న ముచ్చట,లేని ముచ్చట పక్కకు వెడితే.ఇరుగింటి,పొరుగింటక్కా,సిన్న ఏరాలు,పెద్ద ఏరాలు ఏదన్నా కొత్త సీరె కొన్న ,కొత్త నగ సేపిచ్చుకున్న ఇగ సూడు మా నదర్ ,(సూపు) అంత కూడా ఇగ ఆటి మీదనే.
ఇగ గాళ్లకు వుండే మాకు లేకపాయే అని గదంతా మనాది ల వెట్టుకొని ఇగ దేని మీద నన్న  వెట్టి మొగన్ని ఉర్పట  వెట్టుడేనాయే. ఇగ గా  ఉర్పట కు పెండ్లాం ముచ్చట తీర్సుటానికి అప్పో,సప్పో సేసి కొనుడే.
లేక పోతేనా ఇగసూడు మూలకు మంచం ఏసీ మూతిముడిసి అలుగుడే ఇగ.
ఏళ్లకు మొగనికి బువ్వ ,కూర వెట్టేదే లేదు.
(ఇగో అక్కలు అందరు గిట్ల వుండరు గాని గొంత రంకుల(గడుసు)తనం ఉన్నోళ్లు జెప్పన బయట వడుతరు నల్లికుట్ల  తనం ఉన్నోళ్లు బయట వడరు.
ఎంతైనా సీరెలు,నగల మీద మోజు లేని ఆడోళ్లు ఏడఉంటరు )
ఇగ పున్నం బోయినంక మొదలు సీరెలు,గాజులు,నగలు,అప్పాలు,సత్తులు ,పువ్వులు ఇగ ఇయ్యన్ని పండుగ దాకా తయారు చేసుకుంటరు.
#బొడ్డెమ్మ
బొడ్డెమ్మ పున్నం అచ్చినాక ముందుగాల బొడ్డెమ్మ ను ఏత్తరు..ఇగ గి బొడ్డెమ్మ తొమ్మిది రోజులు అడుతరు.
గిది పెళ్లి గాని పొలాగాండ్లు ఆడే ఆట..
పీట మీద ఎర్రమట్టి తోని తొమ్మిది అంత్రాలు సేసి.ఇగ గిదిని మీద మా కాడ అయితే తులిసి మండ ఎట్టి..రుద్రాచ్చ పూలు,మందార పూలు 
ఉద్రాక్ష పువ్వులు దారం లేకుండా ఆ పువ్వుల కాడలనే ఒకదానికి ఒకటి మూడేసి మాల అల్లి.
బొడ్డెమ్మకు ఈ మాలను రోజు ఏసేది.  ఇగ బెడ్డెమ్మ మీద పసువ్,కుంకుమ ఏసీ..
ఆకిట్ల పుట్ట మన్నుతోని అలికి ముగ్గులేసి..గండ్ల వెట్టి
"బొడ్డెమ్మ ,బొడ్డెమ్మ కోల్
బిడ్డాలెందరు  కోల్" అని పాడుకుంటా ఆడేది.
ఇంక పురాతిగా గి ముచ్చట ఎడవలే గాని అటెంక మల్ల చెప్తా.
~~ SN ~~