ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పండుగ_ముచ్చట్లు: సరోజ పోచమల్లు
September 27, 2020 • T. VEDANTA SURY • Memories

బతుకమ్మ పండుగ అంటే  సాలు ఇగ పల్లెలల్ల ఉన్నోళ్లకు,లోనోళ్ళకు సుత మత్తు పెద్ద పండుగాయే .
గందుకే అందరు ఆళ్ల కాడ ఉన్న సిన్నకొత్త,పెద్ద కొత్త అంత పోగేసికొని(జమ) కొత్త బట్టలు అయితే  కొనుక్కుంటరు..గా కొత్తలు (పైసలు,రూపాయలు) ఇంట్ల ఉన్న లేకపోయినా సావుకారు దగ్గర అప్పో,సప్పో సేసి కొనుడే..ఇగ అప్పు ఉట్టక పోతే ఉద్దెర బేరం సేసన్న కొనుడే..

ఆరుగాలం ఎవుసం సేసే రైతన్నకు పంట మీద పెట్టువడి పోంగ గండ్ల ఇగ మిగిలేది ఎంత. గా ఎవుసం ల ఎమ్ పాయిద ఉంటది.అందరికి నోటి కాడికి బువ్వ అందించే రైతన్న ఆడాది పాటు  ఏళ్లకు బువ్వ తినక గడకో, గాంజో తాగుకుంటా ఎండనక,ఆననక,సలిల రెక్కలు ముక్కలు సేసుకొనే రైతన్నకు ఆళ్ల ఇంట్లోల్లలు కూడా బట్టల సోకు ఎక్కడిది..తెల్లారితే పొయ్యి బురదల పని సేసుడేనాయే..

ఏదో గిట్ల పండుగో పబ్బమో అత్తెనే గద ఆళ్లు కొత్త బట్టలు కొనేది.

ఇగ కొన్న కొత్త కోక మీదికి  కొత్త రైక కుట్టిచ్చు తానికి  మెరోళ్ళ అన్న ఇంటికి పోయి బట్టలు ఇత్తె ఇగ ఆ అన్న రేపు రా,మాపు రా ఇగో కుడుతన్న అగో కుడుతన్న అని రోజులు గుడుపుతడాయే.
ఆడి పొలగాండ్లకు ఎనకట అయితే లంగాలు,రైకెలు, జాకెట్టు లు,కుట్టిచ్చు కొని లంగావోని ఏసుకునేటోళ్లు.
మగ పొలగాండ్లకు,లాగులు,నెక్కర్లు ,బుసోట్లు కుట్టిచ్చు కునేది..
ఇగ పెద్ద అయ్యలు దోతుల జోడ మీదికి ఆపారం,ఫుల్లు చేతుల అంగీలు కుట్టిచ్చు కునేది.

మా సిన్నప్పుడు అయితే మెరొళ్ల అన్న ఇంటికి పొద్దుగాల ఓ.సారి ,మాపాటించి ఓ సారి పోయేది..బట్టలు కుట్టినవా ఎప్పుడిత్తవే అన్నా.. ఇంకా అని..
ఇగ ఆ అన్నా పోంగా,పోంగా కుట్టిన బట్టలు ఇచ్చేది ఇగ సూడు ఆ బట్టలు  సూసి మత్తు  సంబురపడేది.
ఓసారి తొడుక్కొని సూసి మురిసి పోయేది..

ఇగ ఉల్లేకు రాజన్నల అక్క.గంప నెత్తిన ఎత్తుకొని  అమ్ముటానికి తీరొక్క బోగరి నగలు తెచ్చేది.
 గయ్యి సుత్తె అచ్చం బంగారం వోలెనే మెరిసేది.
సిన్న పిలగాండ్లకు  బంగారు పెయ్యి మీద ఎత్తే ఏడ పోగొట్టుకుంటరో అని గిట్ల బోగరి నగ  కొని పొయ్యి మీద ఏసేది..
ఇంకా గా రాజన్నల అక్క దగ్గర తీరొక్కటి ఉండేది...
కాటుక డబ్బీలు, తిలకం సీసలు, పౌడర్ డబ్బాలు,సురుమ సీసలు,గోర్ల రంగు అన్ని ఉండేది..
ఇగ గి అక్కలు మెరుగు డబ్బాలు కూడా తెచ్చేది..
తెల్ల మెరుగు డబ్బాలు,పచ్చ మెరుగు డబ్బాలు తెచ్చేది..
ఆడి పొలిగాండ్లు   మోకానికి అంత మెరుగు వూసుకునేది.నాతిరి పూట గా మెరుగు అంత సెక, సెక మెరిసేది..
ఆడోల్లు అన్నెల వడే సామాను అంత ఇగ గా అక్క దగ్గర దొరికేది..

ఇగ పూసవెర్ల అక్క గాజుల గంప నెత్తి మీద వెట్టుకొని గాజులు అంటుకుంటా అచ్చేది.గా అక్క దగ్గర కటింగు గాజులు,కాపీల గాజులు, సిన్న పిలగాండ్లకు గోట్లు,సైడ్ గాజులు అన్ని తీర్ర గాజులు తెచ్చేది.
ఇగ అమ్మ ,లక్కలు అంత గా గంప కాడ కూకొని ముచ్చట్లు సెప్పుకుంటా సేతికి గాజులు తొడిగిపిచ్చుకునేది..రెండు సేతుల నిండారా గాజులు ఏపిచ్చుకునేది.ఎవలికన్న పైసలు లేకపోతే ఉద్దెర కూడా ఏసీ పోయేది.
ఇగ కోక మీదికి కలిసే గాజులు ఏసుకొన్న ఆ అక్కల అన్నెల సూడు.ఎంత ముచ్చట గుండేదో.

కడుమ ముచ్చట తరువాత .
  S... N.