ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పండుగ_ముచ్చట్లు:-- సరోజ పోచమల్లు
October 12, 2020 • T. VEDANTA SURY • Memories

ఇగో గియ్యాల నైతే నా సిన్నప్పడి  సద్దుల బతుకమ్మ ముచ్చట సెప్త.
ఇగ గి రోజు అయితే  మబ్బుల  కోడి గూయంగనే లేసి  ఇంటెనుక గుమ్మడి తీగకు ఉన్న గుమ్మడి పువ్వులన్ని 
తెంపుకచ్చేది.జెప్ప,జెప్ప అలుకు ,ఊత సేసుకొని.
తలకు ఓసుకొని.. మలిన్ని పువ్వులు తెచ్చేది.. 
 మా అవ్వ అయితే పిందె గౌరమ్మ ఉన్న గుమ్మడి పువ్వు తెచ్చి..
ఒక్కపొద్దుతోని..బతుకమ్మ పెర్సేది.
ముందుగాల ఓ పీట ఏసీ గా పీట మీద ఇత్తడి తాంబులం వెట్టి ముందుగాల పుసువ్,కుంకుమ ఏసీ గండ్ల గుమ్మడాకులు వెట్టి.ఇగ పేరుసుడు సురువ్ జేసేది.
ఇగ తంగేడు పువ్వు,గునక పువ్వు( తీరొక్క  రంగు అద్ది  కట్టలు కట్టేది.)కట్ల పువ్వు,ఉద్రాచ్చ,పట్టుకుచ్చు,గోరంట పువ్వులు తీరొక్క పువ్వుతోని బతుకమ్మ పెర్సేది..
బతుకమ్మ వెర్సే టప్పుడు బతుకమ్మ కడుపుల తంగేడు ఆకు నింపేది.బతుకమ్మ కదల కుండ మంచిగ కూసో టానికి.తంగేడు ఆకు,పెర్వ0గ రాలిన పువ్వులు అన్ని పోసుకుంటా బగ్గ ఎత్తు పేర్సెదుంటే తాళ్ళు కట్టుకుంటా పేరిసేది.
ఇగ బతుకమ్మ పెర్సుడు అయినంక..పెరుగు సద్ధి కలిపి  ఓ టిపిని గిన్నెల వెట్టి బతుకమ్మ కాడ ఉంచేది.ఇగ అయిదు తీర్ల సత్తు ముద్దలు చేసి (నువ్వులు,పల్లీలు, పెసరు, బియ్యం,కుడుక,లేదంటే మినప సత్తు) తీసి..గయ్యి కూడా ఓ టిపిని ల వెట్టి ఉంచేది.బతుకమ్మ పేరుసుడు ఆయునంక  సిన్న బతుకమ్మను,పెద్ద బతుకమ్మను 
రెండిటిని కూడా  కూరాడు కాడ పీటలు ఏసీ కూసో వెట్టి.
సిక్కుడు ఆకులు తెచ్చి గండ్ల గౌరమ్మ ను సేసి..అస్త్రం సేసి ఏసీ..దాని మీద పసువ్,కుంకుమ ఏసీ మొక్కేది.ఇంకో ఆకుల అయిదు తీర్ల సత్తు ,దోసకాయ ముక్కలు ఎట్టి మొక్కేది...
ఇగ గప్పుడు ఒక్కపొద్దు ఇడిసేది.
ఇగ గి పండుగకు ఆడి పొగాండ్లకు బతుకమ్మ వాయినం పంపేది...
జాబుల తోని సేసిన బతుకమ్మ,సీరె,సారె,అత్తగారింటి నుండి అచ్చేది...
ఇగ మాపటికి కొత్త బట్టలు ఏసుకొని తయారయి..
ముందు గాల ఇంటి ముందు ఎట్టి ఓ.ఐదు సుట్లు తిరిగి  డప్పుల సప్పుడు తోని బతుకమ్మ తీసుకొని పోయి అందరు ఒక్కకాడ ఎట్టి..ఇగ ఆడేది..
అందరం ఆఫీస్ కాడ మూడు తొవ్వల మీద వెట్టి ఆడేది.ఇగ అడ్లోళ్ళ
శకుంతలక్క ఒక్కతే  పాడేది ఒక్కటే పెద్ద పాట తీసే దాకా పాడేది..
"రామ ,రామ ఉయ్యాలో..
రామనే సీతమ్మ ఉయ్యాలో..
అయ్యాయో ఓ రామ ఉయ్యాలో..
అయ్యోద్య ఓ రామ ఉయ్యాలో
నెత్తిమ మీది సూరుడా ఉయ్యాలో
నెలవన్నె కాడ ఉయ్యాలో
పాపిట్ల సెంద్రుడా ఉయ్యాలో
పాలకోమారుడా ఉయ్యాలో"
అని..
ఇగ అద్దరాతిరి దాకా  మస్తు ఆడు కునేది
సప్పట్లు కలుపుకుంట అంగుకుంట ,లేసుకుంట కాళ్ళు కలుపుకుంట ఆడేది..
ఇగ పడుసు పొలగాండ్లు ఆడుతాంటే సప్పట్లు మోత మత్తు మోగేది..గిప్పడి డీ.జే.ఎందుకు పని కిత్తయ్ గా ఆట మీద.ఇగ ఊరంత ఆళ్ల ఆటను సూసుటానికి అక్కడి కచ్చేది.ఇగ నెరి వడే దాకా ఆడి.నడి జాము రాతిరి.
బతుకమ్మలను డప్పుల సప్పుడు తోని.. గౌరమ్మ ను తీసి కొంగుల కట్టుకొని..దీపం ముట్టిచ్చి..ఎత్తుకొని పోయేది...
ఇగ గా మత్తడి కాడ పారే నీళ్ళల్లో ఏసినంక.. తాంబూలం ల గక్కడి నీళ్లు తెచ్చి ..గౌరమ్మను తడిపి అండరికి పూసుకుంటా...
 బతుకమ్మ కాడ వెట్టి మొక్కిన ఎంగిలి గాని సత్తు సద్ధి గిన్నెల తెచ్చి ఇచ్చుకో అయినం పుచ్చుకో అయినం ఆడినంక మల్లేటికళ్ల మల్లత్త బతుకమ్మ తల్లి అని.. ఇగ సల్లగా ఇంటికి సెరేది..
ఇగ ఇంటికి అచ్చినంక పెరుగు సద్ధి ఇంట్ల పిల్లలు ,పెద్ధోళ్లకు అందరికి వెట్టి తిని గప్పుడు ఓ కునుకు తీసేది.
ఇగ ఉంటనుల్ల రేపు దసర ముచ్చట్ల తోని మల్లత్త..
~~ SN ~~