ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పగటికలలు ---డాక్టర్. కందేపి రాణీ ప్రసాద్
November 5, 2020 • T. VEDANTA SURY • Poem

మనకొచ్చేవేమో అత్తెసరు మార్కులు
ఆశలేమో అక్స్ఫర్డ్లు, కేంబ్రిడ్జిల్లో
టైమపగటికలలుును వృధా చేస్తూ gre టోఫెల్ లు
అమ్మానాన్నలు శ్రమదోపిడీ పరీక్షలు

ఓపెన్ డిగ్రీ చదివి సర్టిఫికెట్ వచ్చిందా
సివిల్స్ కోచింగుల్లోనే వెళ్లి చేరేది
ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ రానోడు
డిగ్రీ తర్వాత కలెక్టర్ కే ఎసరు పెడతాడు.

మనోడు కొద్దిగా క్రికెట్ బాగా ఆడా డో
సచిన్ అవ్వాలని కోచింగ్ లో చేరడమే
మనమ్మాయి అందంగా ఉందని అన్నారో
ఐశ్వర్యారాయ్ కిఎదురు పోటీ పడడమే.

మింగ మెతుకు లేదు,మీసాలుకు సంపెంగ
కలలు కనమంటే,సాధ్యమయేవి కనాలి
రాత్రికి రాత్రే అంబానీ కావాలంటే ఎలా
స్వప్నాల లోయల్లో చిక్కుబడితే ఎలా

ఆశకు హద్దుండలి,ఆశకు అంతుండాలి
అలివిమలిన కోరికలు అత్యాసాల గుర్రాలు
పగతికలలు కని కోడిగుడ్లు నెలపాలైనట్లు
అసాధ్య కలలు అశాంతి ని కలిగిస్తాయి.