ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పచ్చికుండ-- డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి
October 6, 2020 • T. VEDANTA SURY • Story

ముందు వరుసలో కూర్చునే సాగర్ కనిపించలేదు. వరుసగా రాకపోవడం వల్ల ఎందుకు వస్తలేడని ఆరా తీసిన. ‘‘తెలుగు మీడియం క్లాసులో కూర్చుంటుండని తెలిసింది’’. ఎందుకో తెలుసుకోవాలని పించింది. తెలుగు మీడియం క్లాస్ టీచర్ బుంగి. అతణ్ణి అడిగి వివరాలు తెలుసుకోవాలనుకున్న. కాని మరిచి పోయిన. ఒక రోజు స్కూల్ గ్రౌండ్‌లో సాగర్ ఎదురయిండు.
‘‘నమస్తే సార్’’
‘‘తెలుగు మీడియం లోకి ఎందుకు మారినవు’’
‘‘వట్టిగనే’’
‘‘పాఠం అర్థం కావడం లేదా, లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయితుందా’’
‘‘పోవాలనిపించి పోయిన’’ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిండు
సాగర్ నా కొక పజిల్ అయిండు. వెంటనే బుంగి వద్దకు వెళ్ళి ఇతని గురించి అడిగిన. సాగర్‌కున్న బాధ్యతలు తెలిసినవి. పక్షవాతపు తండ్రి, పిస్సలేసిన తల్లి, అమాయకపు చెల్లె వీరి బాధ్యతలు సాగర్ చూసుకోవాల్సి ఉంది. అందుకే కూలి పనులకు వెళ్తున్నడట. పనిలేని రోజు బడికి వస్తున్నడట. ఈ విషయాలన్ని తెలిసిన తర్వాత సాగర్ తెలుగు మీడియంకు ఎందుకు మారిండో అర్థమయింది. పచ్చికుండ లాంటి జీవితం, వాణ్ణి బడినుండి ఎపడు దూరం చేస్తదో అనిపించింది.
గ్రాస మింత లేక కష్టపడుచును
విద్య యేల నిలుచు వెడలుగాక
పచ్చికుండ నీరు పట్టినా నిలుచునా
విశ్వదాభిరామ వినురవేమ
వేమన శతకం
వేమన