ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పచ్చిగడ్డి_మోపు: - సరోజ పోచమల్లు
November 4, 2020 • T. VEDANTA SURY • News

పచ్చ గడ్డి అంటే పసురాలకు (పశువులకు) ఇంట్ల పెంపకం సేసె బర్లు,దుడ్డే,ఆవు,దూడలు, ఎడ్లు గిట్ల ఎవన్న గాని గాటికి ఇగ పచ్చి గడ్డి అంటే సికన్ బిర్యానీ వోలో.గందుకే గొంత మంది ఇంట్ల పెంపకం పసువులకు ఇంటెనుక పెరట్ల ఇంత నీరు జొన్లు వోసి సొప్ప వెంచుతరు.
ఇగ పొలాల,సేండ్ల గెట్ల ఎంబడి గూడ పచ్చి గడ్డి ఇరగ దొరుకుతది.ఏసంగి పొలాలు కోసే దాకా దొరుకుతది.
కానీ ఇగో గా ఎనకటి దినం వోలో  ఎక్కడ ఉంది.పచ్చి గడ్డి కూడ కరువైతంది. పొలాలకు ఎక్కడి,ఎక్కడి రోగాలో దాపురించవట్టే. గా రోగం రాకుండ  అన్ని మందులు కొట్టుడే.
పొలం ల గుడ్డ వెట్టింది మొదలు కోత వట్టె దాకా మందులు కొట్టుడే.
ఇగ ఎనకటి వోలే ఎవుసాయం సేసే టోళ్లు కూడా కరువయ్యే ఎవుసం పనులు సేసే అక్కలు కూడా తక్కువనే అయ్యే.ఇగ పొలం కలుపులపుడు ఉన్న గొంత మంది ఎవరికని పోతరు. మంది తక్కువ ఉండి కైకిలి కూడా పెంచిరి.ఇగ గా కైకిళ్ళు బాగా ఎక్కువ అయితయ్ అని.ఇంత గడ్డి మందు తెచ్చి కొట్ట వట్టిరి.
ఇగ పొలం సుట్టు గెట్ల పొన్న కూడా గీ మందు కొట్టుడే,ఇగ పత్తి సేండ్లల్ల అయితే సెప్పుడే లేదు మొత్తం గడ్డి మందులే. సూద్దాం అన్న గడ్డి కనవడ కుండ సెత్తండ్రు.పసువులను  మోపుదాం  అన్న కూడా ఏడ గింత జాగా లేకుండా సేతండ్రు.
ఇగ గి పచ్చి గడ్డి ఎత్తే బర్లు జెరంత పాలు ఎక్కువ ఇత్తయని ఆశ.గది కాక పచ్చి గడ్డి మంచిగ మేత్తయ్.
ఆయిటి వూనంగా సినికులను గప్పుడు,గిప్పుడే వడే పస్క మేత్తె ఇగ బర్ల కైతే గాలి అయితది (పుర్రుకొట్టుడు)గిట్ల గాలి అయిన బర్లకు తెల్జోండ్లు ఉడక వెట్టి పెడతరు.జెప్పన తగ్గుటానికి.ఇగ జెరంత ఆన కాలం ఎనకకు వట్టి మాగి దాగా మత్తు పచ్చి గడ్డి.గిప్పుడు పసువులు మేసుటానికి బీడు జాగే కరువయ్యే.
ఇగ కన్నారం దిక్కు అయితే బర్లను మొత్తం మట్ల మీద పెట్టి మేపుడే.పొద్దు0దాక గాటి గోస సూడాలే ఇగ ఈగలు,దోమలు కుట్టుతాంటే గాటి గోస చూడబుద్ధి కాదు.
ఇగ గంగవతల గిట్ల ఉంటే ఇగ మా కాడ కొద్దిగ నయ్యం.బర్లను జంగల్ కి కొట్టుక పోయి మేపుకత్తరు.జంగళ్ల నన్న ఇంత పచ్చి గడ్డి దొరుకుతాంది పసువులకు.
ఎంతైనా బయట తిరుగుకుంట మేసి సెర్ల కడుపు నిండ నీళ్లు తాగి ఇంటికి అచ్చిన బర్రె ,ఆవు లెక్కన మట్ల మీద వెట్టిన బర్రె,ఆవు ఎట్ల ఉంటది.
~~SN~~