ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పట్టుదల(బాలస్ఫూర్తి కథ)-- కందర్ప మూర్తి ,హైదరాబాదు--మొబైల్ : 8374540331
November 20, 2020 • T. VEDANTA SURY • Story

ప్రణవ్ హైదరాబాదు కార్పొరేట్ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో ఐదవ తరగతి చదువుతున్నాడు.
     పాఠశాలకు శలవులైనందున అగ్రహారంలో ఉండే  విజయ పిన్ని ఇంటి కొచ్చాడు.
       పల్లె వాతావరణం, చుట్టూ కొండలు,పచ్చని పంటపొలాలు,
 రకరకాల పక్షులు జంతువులు చెరువులో ఈదే తెల్లని బాతులు
  తామర పువ్వుల్నీ చూసి మురిసి పోయాడు.
      ఇంటి దగ్గర విజ్జిపిన్ని కూతురు లక్ష్మి అక్క, వాసు అన్నయ్య శలవుల్లో రంగు బొమ్మలున్న తెలుగు బాలమాస పత్రికలు తెచ్చుకుని చదువు కుంటున్నారు.
         వాళ్లిద్దరూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదువుతున్నారు.తనది ఆంగ్ల మాధ్యమ
మైనందున తెలుగు చదవడం రాదు .అందువల్ల వాళ్లు తెలుగు
 బాలల మాస పత్రికల్లో కథలు బయటకు చదువుతూంటే
 ఆశక్తితో వినేవాడు.
     ప్రణవ్ కి హైదరాబాదులో ఇంటి వద్ద తెలుగు మాట్లాడటం తప్ప చదవడం, రాయడం రాదు. నర్సరీ నుంచి ఆంగ్ల అక్షరాలు
  ఎబిసిడీ లు నేర్పించి తర్వాత లోవర్ కె.జి , అప్పర్ కె.జి ,
ఫస్టు క్లాసు నుంచి చదువు ఆంగ్ల మాధ్యమం లోనే జరుగుతోంది.
     కార్పొరేట్ పాఠశాలల్లో ఆంగ్లం తప్ప మరోభాష మాట్లాడనివ్వరు.
ఇంటి దగ్గర చదువుకోడానికి ఆంగ్ల కామిక్సు , రైమ్సు , కార్టూన్ బుక్సు తప్ప మరొక పుస్తక ముండదు.
      విజయ పిన్ని ఇంటి దగ్గరున్న పిల్లల కథల పుస్తకాల్లో బొమ్మలు చూడటం తప్ప కథలు చదవడం రాదు.
    స్వతహాగా ఉపాధ్యాయురాలైన విజ్జి పిన్ని ప్రణవ్ పరిస్థితి అర్థం చేసుకుంది.వాడికి ఈ శలవుల్లో తెలుగు చదవడం,
రాయడం నేర్పాలనుకుంది.
     తెలుగు పెదబాల శిక్ష , పలక ,బలపం తెప్పించి తెలుగు అక్షరాలు అఆ ఇఈ ల నుంచి అక్షర మాల , గుణింతాలు
 మొదలు రెండక్షరాలు తర్వాత మూడక్షరాల పేర్లు రాయడం
చదవడం నేర్పింది.
మెల్లగా మొదటి తరగతి పుస్తకం చదివించడం ప్రారంభించింది.
      ప్రణవ్ కి మాతృభాష మీద మమత పెరిగి తెలుగు నేర్చుకోవాలన్న  పట్టుదల పెరిగింది. వాడు ఇప్పుడు పిల్లల
 మాస పత్రికల్లోని  చిన్న చిన్న  కథలు కూడ పలికి  
చదవ గలుగుతున్నాడు.
       తెలుగు చదువు మీద వాడి ధ్యాస చూసి దగ్గరుండి రోజూ చదివిస్తోంది విజ్జి పిన్ని.
     శలవులు పూర్తయి పాఠశాల తెరిచే రోజులు దగ్గర పడ్డాయి.
ప్రణవ్ కి  తెలుగు చదవడం రాయడంలో పట్టుదల ఎక్కువైంది.
   తను హైదరాబాద్ వెళ్లే లోపు బాలల మాస పత్రిక లోని కథలు చదివి అన్నయ్య , అక్క కి వినిపించాలని నిశ్చయించుకున్నాడు.
   తెలుగు పట్ల వాడి ఆశక్తి చూసి విజ్జిపిన్ని మరింత శ్రద్ధ కనబర్చింది.
      ప్రణవ్ రేపే హైదరాబాదుకి తిరుగు ప్రయాణం. పల్లెటూరి వాతావరణం బాగా ఎంజాయ్ చేసాడు.
   శలవుల్లో విజ్జిపిన్ని సాయంతో తెలుగు భాష బాగా చదవడం రాయడం నేర్చుకున్నాడు.
     ప్రణవ్ స్వయంగా తెలుగు బాలల మాస పత్రికల కథలు చదవడం చూసి లక్ష్మి , వాసు ఆశ్చర్య పోయారు.
  విజయ పిన్ని  వాడికి  మాతృభాష తెలుగు చదవడం పట్ల సంతృప్తిగా ఉంది.
   ఆశక్తి  పట్టుదల ఉంటే దేన్నైనా సాధించ వచ్చని ప్రణవ్ నిరూపించాడు.
                          *                   *                 *
                    :