ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పట్టు-- డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి
October 4, 2020 • T. VEDANTA SURY • Story

‘‘ప్రాణి ఏదైనా తన జీవిక కోసం ప్రయత్నిస్తుంటది. ఒక్కోసారి రాజీపడినట్టుగా కనపడతది. కాని పట్టు మాత్రం వీడదు. రాజీ కూడా ప్రయత్నంలో భాగమే’’ ఉన్నట్టుండి అన్నడు బుంగి.
‘‘ఇలాంటివి ఎన్నయినా చెప్పవచ్చు. సాక్ష్యం చూపెట్టగలవా’’ అన్నాను. 
‘‘నా అనుభవమే దానికి సాక్ష్యం’’ అంటూ తను ఎదుర్కొన్న సంఘటనను ఏకరువు పెట్టిండు.
రెండు రోజుల నుండి దాగుడుమూతలు సాగుతున్నవి. నాకు ప్రాణికి మధ్య జరుగుతున్న ఆట అది. యాదృశ్చికమే అయినా దాని ప్రతిప్రయత్నం నా కంటపడు తున్నది. రాత్రి పూట దీన్ని రాకుండా ఆపగలిగితే పొద్దున దానంతట అదే ఆగిపోతుందని నాకు తెలుసు. అలాగే జరిగింది. రెండోరోజు రాత్రి పూట ఇంట్లోకి రావడానికి మరింత ఎక్కువ ప్రయత్నం చేసింది. రెండురోజుల్నుండి బయటెకళ్ళక ఇంట్లో ఉన్న నాకు ఈ వ్యవహారం చిరాకును కలిగించింది. దాని పట్టుదలకు ఆశ్చర్యపోయిన నేను ఆలోచనల్లో ఉండగానే ముందుకు చొచ్చుకువచ్చింది. క్షణంలో మాయమయింది. అందకుండా పోయింది. ఇంట్లోకి రాలేదని మాత్రం నాకు తెలుసు. ఆట ఇపడే తెగదనీ తెలుసు. భోజనానికి కూర్చున్న కాని నా మనసు దానిపైనే. ఎటు నుండి దూరుతుందో తెలియదు. ఓ కంట కనిపెడుతూనే భోజనం అయిందనిపించిన. కాస్త అలికిడయింది. గోడపై కనిపించిందది. కర్రతో బలంగా కొట్టిన. చచ్చి పడింది ఎలుక.’’ అని ముగించిండు. నాకు నవ్వాగింది కాదు.
పట్టుపట్టరాదు పట్టివిడువరాదు
పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టువిడుటకన్న పడిచచ్చుటే మేలు
విశ్వదాభిరామ వినురవేమ
వేమన శతకం
వేమన