ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పట్టెడు-. - డాక్టర్ . బి. వి. ఎన్ స్వామి
September 29, 2020 • T. VEDANTA SURY • Story

పాఠశాలలో అడ్మిషన్స్ జరుగుతున్నవి. పిల్లలు, తల్లి దండ్రులు, ఉపాధ్యాయుల మధ్య బిజీగా ఉన్నడు బుంగి. డ్రాపౌట్స్ తిరిగి వచ్చి చేరుతున్నరు. పుట్టెడు సమస్యలు అతని చుట్టూ కొలువుతీరినయి.
‘‘పోయిన యాడాది ఏడో తరగతి చదువంగా బల్లెనే ఫిట్స్ రోగం వచ్చి పడ్డడు. ఆన్నుంచి యాడాది మొత్తం బడికి రాలేదు. ఇపడు ఎనమిదిల కూసుంట అంటున్నడు. కూసోబెట్టుకోండ్రి.’’
‘‘పిల్లగానికి 15, 16 ఏండ్లు ఉంటయి. ఏదో క్లాసుల కూసో బెట్టుకోండ్రి. ఇంట్ల ఉంటే చేతికి వచ్చేటట్లు లేడు’’
‘‘ఈ బల్లె వేస్తే హాస్టల్ల సీటు దొరుకుతదట. అందుకే దీంట్ల ఏత్తున్న’’
‘‘ప్రైవేటు బల్లె ఫీజులు బాగ పెంచిండ్రు. పోయిన యాడాది పైసలు కట్టలేదు. వాడు సర్టిఫికెట్లు ఇస్తలేడు. అందుకే ఈ బల్లెకు తీసుకవచ్చిన ఏడుల షరీక్ చేసుకోండ్రి, బాంచెన్’’
ఇలా తల్లి దండ్రులు తమ పిల్లల స్థాయిని గమనించకుండా అడగడం ఒక వైపు, మరో వైపు ఉపాధ్యాయుల మాటలు ఇలా ఉన్నవి.
‘‘ఎటువంటి వారన్నది కాదు. ఎందరు చేరారన్నది ప్రశ్న’’
‘‘క్లాసులు నిండి పోవాలె సార్’’
‘‘విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటె మన పోస్టులు వేరే చోటికి షిఫ్ట్ అయితయి’’
‘‘బడి మూత పడే స్థితి రావద్దు. అందర్ని తీసుకోవాలె’’
‘‘ప్రతి ఒక్కర్ని తీసుకోండి. అందర్ని పాస్ చేద్దాం’’
ఉపాధ్యాయుల మాటలు నిజమే అనిపిస్తున్నయి. కాని ఇంత మందిలో పేరు నిలపగల విద్యార్థులెందరు? పట్టెడు మందైనా ఉంటరా! అనే ప్రశ్న బుంగి ముందు ప్రత్యక్షమైంది.
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు
తళుకు బెళుకు రాలు తట్టెడేల
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ
వేమన శతకం
వేమన