ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పద పదరా పయ్యాటలా పరుగులే పెడదాం తగలకురా తబుక్కున పడిపోతాం పద పదరా మన వేగమేమిటో చూపుదాం హేహే హే గుంటలు వస్తవిరో జరవేగంలో చూసి పోవాల్రో. అరె వంపులు ఒంపుల్లో కాస్త చూసి వేగమె పెంచాలిరా. అరె అరే ట్యూబ్ ఎగిరిన వంగినా స్లిప్పైపోవురో అరె అరె మొసెక్కువ దీసావా మొదటికే మూలకు పడుడేరో వెనకబడితే వెనుకకేరో మరి ఆదుర్దాపడి ఉరికావో బోర్లబొక్కున పడుడేరో జర చూసి మనను మించి ఉరికేటోన్నీ గమనించి పోవాల్ రో పైయ్యాటంటే చిర్రగోనే కాదురా ఎలా పరిగెత్తి పోవాల్నోగమనించు కోవాల్రో. వెయ్ వెయ్ అడుగేయ్. వెనుకకు ముందుచూసుకొనే వేగం పెంచి పోవాల్రో. పైయ్యాటంటే పైలా పచ్చీస్ కానేకాదురో జయంత్ నమిలకొండ
June 27, 2020 • T. VEDANTA SURY • Poem