ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పనికిరాని బతుకు!-- ఉదయపు మంచుబిందువల్లే స్వచ్ఛంగా ఉన్న కాగితం గొప్పలు పోయింది. "నా పుట్టుక పవిత్రమైంది. నేనెంతో స్వచ్ఛమైనదానిని. పరిశుద్ధమైనదానిని. ఎల్లకాలమూ ఇలానే స్వచ్ఛంగా ఉంటాను. నన్ను కాల్చి బుగ్గిపాలు చేసినా భరిస్తాను. కానీ నల్లటి సిరాను నా దగ్గరకు రానివ్వను. నాకు మరకలు గిట్టవు. అసహ్యం...." అంది మల్లెపూవులాటి తెల్లకాగితం.ఈ మాటలువిన్న సిరా కాగితాన్ని చూసి గలగలా నవ్వింది. కాగితం పక్కకే వెళ్ళకూడదని నిశ్చయించుకుంది.ఈ మాట విన్న రంగుల పెన్సిళ్ళుసైతం కాగితం జోలికే పోలేదు.దీంతో కాగితం జీవితాంతమూ స్వచ్ఛంగానే ఉండిపోయింది కానీ ఎందుకూ పనికిరానిదై!!మూలం - ఖలీల్ జిబ్రాన్ స్వేచ్ఛానువాదం - యామిజాల జగదీశ్
June 24, 2020 • T. VEDANTA SURY • News