ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పరిమళం...--డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,హనంకొండ ,వరంగల్ అర్బన్ 9866252002-8886991785
September 26, 2020 • T. VEDANTA SURY • Poem

అమ్మా ..అంటే -
పలకదు ' మమ్మీ ',
మమ్మీ ...అంటే -
అనందంగా ,ఆ ...
అంటుంది ..' అమ్మ '!

నాన్నా ..అంటే -
" నన్నా ..!" అన్నట్టు 
చూస్తారు ..'డాడీ ',
డాడీ ..అని పిలిస్తే ,
సంతోషంగా --
"చెప్పునాన్నా "
అంటారు ..'నాన్న '!

అయోమయంలో నేను ,
తల్లిభాషకు దూరమయి ,
పరభాషకు దగ్గరవుతున్నా !
మాతృభాష పరిమళాన్ని ,
మరచిపోతానన్న-
  బాధ  లో ఉన్నా ..!!