ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పరోపకారం; రావిపల్లి వాసుదేవరావుపారవతీపురం ఫోన్ నెంబర్ :9441713136.
September 18, 2020 • T. VEDANTA SURY • Poem

ఏపుగ పెరిగిన చెట్టేమో
పక్షులకూ ఆవాసమగు

చీమలు చేసిన పుట్టేమో
పాములకూ వసతి అగు

తేనెపట్టులో తేనేమో
మనుషులకూ ఆహారమగు

ఆనందంగా కాకేమో
కోకిల పిల్లకు తల్లగు

పొదిగిపెట్టును కోడేమో
బాతు గుడ్లను ప్రేమతో

పారుతున్నట్టి ఏరోమో
తగ్గించును దాహార్తిని

నేలతల్లి జీవులకేమో
తీర్చిపెట్టును ఆకలిని

చల్లని కరి మబ్బేమో
ఇచ్చును చక్కని వానను

పరోపకార గుణమేమో
ప్రకృతికీ ఎంతో సహజం

ఆ గుణమును కలిగుంటే
అవుతుంది జన్మ సార్ధకం