ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పరోపకారి : -- డా.. కందేపి రాణీప్రసాద్.
November 17, 2020 • T. VEDANTA SURY • Story

;ఒక గ్రామంలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు పక్క పక్క ఇళ్ళల్లో ఉండేవారు. వీరిలో రామయ్య ఊర్లో వారందరికి తోచిన సాయం చేస్తూ అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కష్టమని తలచక తోచిన సాయం చేసేవాడు. కానీ సోమయ్య మాత్రం ఎవరికి ఏమి చేసేవాడు కాదు. ఎవరైనా ఏదైనా అడిగితే కటిక్కిన లేదనేవాడు. అద్నుకే ఊర్లో వారందరూ రామయ్యంటే ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చేవారు కానీ సోమయ్యను మాత్రం ఎవరు పట్టించుకునేవారు కాదు. ఇది చూసిన  సొమ్మయకు ఒంటికి కారం రాసుకున్నట్లుండేది. తనను ఎవరు గౌరవించక పొగ రామయ్యను అందరూ ఆప్యాయంగా చుడటమనేది సోమయ్యాలో ఈర్ష్యద్వేషాలు రగిలించాయి. ఈ ఈర్ష్యద్వేషం అంతకంతకూ పెరిగి అతన్ని మట్టుబెట్టాలనుకునేంతవరకు వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచించసాగడు. ఏదో ఒక అవకాశం రాకపోతుందా అని ఎదురు చూడసాగాడు.
 ఓరోజు సాయంత్రం ఖాళీగా ఆరుబయట కూర్చున్నా రామయ్యను చూడగానే సోమయ్య మనసులో ఓ పథకం రూపుదిద్దుకుంది. ‘రామయ్య! అలా మన పొలాల పక్కనున్న కొండదాకా చల్లగాలికి షికారుకెలదాం. వస్తావా?” అని అడిగాడు సోమయ్య. అతని మనసులోని కపటాన్ని గుర్తించని రామయ్య ‘సరే వేళదాం పద’ అంటూ బయల్దేరాడు. ఇద్దరు నడుచుకుంటూ పొలాల వైపు వెళ్లారు. పొలాల దాకా వెళ్ళాక ‘కొండ ఎక్కుదాం రా రామయ్య’ అన్నాడు. ‘ఇప్పటికే సంధ్యాసమయం అయింది. చీకటి పడే వేళయింది. ఇంకికెళ్లిపోదాం సోమయ్య!” అన్నాడు. రామయ్య.
 ‘కాదు కాదు. రామయ్య! కొండ మీద నుంచి సూర్యాస్తమయం చూడటం చాలా బాగుంటుంది!’ అంటూ కొండను ఎక్కసాగాడు సోమయ్య.
 సరే అని ఇద్దరు కొండ పైభాగానికి చేరుకున్నారు. ఒండ మీద ఒక బిలం ఉండి లోపల గుహ ఉంటుందని, దాంట్లో దెయ్యలూ, భూతాలూ నివాసం ఉంటాయని ఊర్లో వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు. సరిగ్గా ఆ బిలం దగ్గర దాకా వెళ్ళాక “ అదుగో చూడు రామయ్య! ఆకాశం ఎంతందంగా ఉందో! సూర్యుడు ఎర్రగా నారింజకాయాలా ఎంత బావున్నాడో!’ అంటూ ఆకాశం వైపు చూపిస్తూ రామయ్యను బిలంలోకి తోసేశాడు. ఆ కన్నం చిన్నగా ఉండటం వలన గుహలోకి వెలుతురు పెద్దగా రాదు. ‘లోపల పడిన వాణ్ని ఎవరు చూసే అవకాశం లేదు కాబట్టి చచ్చినా పైకి రాదు. పీడ విరగడైపోయింది’ అనుకుంటూ సంతోషంగా వెనుదిరిగాడు సోమయ్య.
 ఆ గుహలోపల చాలాకాలంగా ఒక దెయ్యం నివాసిస్తోంది. అది చాలా మంచిది. అది రామయ్యను చూసి జాలిపడి ‘ఏమైనా సాయం కావాలా’ అని అడిగింది. సహాయం చెయ్యాటమే కానీ సహాయం చేయించుకోవడం తెలియదతడికి. అందుకే ‘నాకేమీ వద్దు’ అన్నాడు. “ఇక్కడే నీకు రుచికరమైన భోజనం వండిపెడుతూ నీకు తోడుగా ఉంటాను. నువ్వేప్పుడూ మాంసాలు తిని బతికేవాడివి కదా! నీకు సాత్వికాహారం రుచి చూపిస్తాను” అంటూ రోజు దానికి మంచి ఆహారం వండి పెట్టసాగాడు. ఆ వెంటల రుచి చూసిన దెయ్యం రామయ్యను మెచ్చుకోలుగా చూసి “రామయ్య! ఇక నుంచి నేను మాంసాహారం ముత్తను. సాత్వికాహారం తింటాను” అని ప్రతిజ్ఞ చేసింది.
 తర్వాత దెయ్యం రామయ్యతో ఇలా అన్నది. “నేను నీ సాహచర్యంతో మాంసాహారం నుంచి శాఖాహారిగా మారాను. నీలాంటి వాళ్ల సాయం ఊర్లో ఎంతోమందికి ఉంటుంది. నువ్విక్కడే ఉండిపోతే ఎలా? నీ కుటుంబం దిక్కులేనిదై పోతుంది. నేను చెప్పిన మాట విని నువ్వు మీ గ్రామానికి వెళ్లిపో. నేను సాయం చేస్తాను”.
 చివరకు సరే అని ఒప్పుకున్నాడు రామయ్య. “రామయ్య! వెళ్ళేముందు ఒక్కమాట. అదిగో ఆ మూల ఉన్న కొన్ని రాళ్ళను మూత కట్టుకొని తీసుకు వెళ్ళి దేవుడి దగ్గర ఉంచు. నీకు ఏదైనా అవసరం ఏర్పడినపుడు ఆ మూట తెరువు. అవి నీకు సాయం చేస్తాయి” అని చెప్పి దెయ్యం రామయ్యను తీసుకొచ్చి గుహ బయట వదిలి పెట్టింది. రామయ్య కొండ దగ్గర నుంచి ఇంటికి చేరాడు.
 కొన్నాళ్లకు రామయ్య కూతురు పెళ్లి కుదరడంతో దేవుడి దగ్గర పెట్టిన రాళ్ళమూటను విప్పాడు. ఆశ్చర్యం! అవి రాళ్ళు కాదు. వజ్రాలు ఆ వజ్రాలమ్మి వచ్చిన డబ్బుతో కూతురి పెళ్లి ఘనంగా చేశాడు రామయ్య. పక్కింట్లో ఉంది ఇదంతా చూస్తున్న సోమయ్యకు ఏమి అర్థం కావట్లేదు. రామయ్య అసలేలా బతికాడు? పైగా ఇంత డబ్బేలా వచ్చిందీ? తెలియక తలకొట్టుకున్నాడు. వెంటనే వెళ్ళి రామయ్యను అడిగేశాడు. రామయ్య జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరంగా చెప్పాడు.
 అంతా విన్న సోమయ్య పశ్చాత్తాపంతో సిగ్గుపడ్డాడు. మంచివాళ్ళకు దేవుల్లే కాదు దెయ్యలూ సహాయం చేస్తాయని తెలుసుకుని “నా అసూయకు సిగ్గుపడుతున్నా. నన్ను క్షమించు!” అని రామయ్యను వేడుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడు సోమయ్య రామయ్యను చూసి ఈర్ష్య పడలేదు.