ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పలుకుల -మొలకలు ..--మొహమ్మద్ అఫ్సర వలీషా --ద్వారపూడి (తూ గో జి) --సెల్...8500597116.
October 12, 2020 • T. VEDANTA SURY • Poem

నట్టింట చిన్నారి
 చిలక పలుకులు....

అలసి సొలసి న
 మా హృదయాలకు
 పన్నీటి జల్లులు ....

అందమైన గోదావరి
 గలగలలు .....

ప్రకృతి హొయల 
పులకరింపులు....

పక్షులు కుహు కుహుల
 పదనిసలు .....

కోపావేశాలకు
 ఆనకట్టలు....

ఉత్సాపు ఊయలు....

ఆకాశాన చుక్కలన్నీ కలిసి 
ఆడే చమ్మాచక్కలు...

జాబిలి తన చల్లని వెన్నెలతో
 అవనిని ఆర్తిగా తడిపే కళ్ళాపులు....

మొత్తానికి మా ఆనందాల తోటలో
 విరిసిన మరుమల్లెలు...

నట్టింట చిన్నారి చిలక పలుకులు
 పరిమళ భరితం 
సుమధురం సాంత్వనం ......!!