ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పలువిద్యలు: డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి
October 15, 2020 • T. VEDANTA SURY • Story

ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలకు అంతం లేకుండా ఉంది. ఎవరు ఎక్కడ ఏ విధంగా విరుచుకపడతారో తెలియ కుండా ఉంది. ఈ వాతావరణం వల్ల అభద్రత ఆవరిస్తుంది. ఊహకందని విధాలుగా సంఘటనలు జరుగుతున్నయి. వృద్ధుల నుండి మైనర్‌ల దాకా మృగాళ్ళు రెచ్చిపోతున్నారు. తెల్లవారి పత్రిక చూడాలంటే భయం అయితున్నది. ఛానళ్ళ హడావిడి అంతా ఇంతా కాదు. హాస్టల్స్‌లో ప్రసవిస్తే వార్డెన్స్‌కు తెలియటం లేదు. గర్భవతిని గుర్తించలేని ఉపాధ్యాయు వైనం చిత్రంగా ఉంది. తల్లిదండ్రులకు తెలిసే లోపల జరగకూడనిది జరిగిపోతుంది. మొత్తానికి క్రమరాహిత్యం సమాజాన్ని కమ్ముకుంది. పలువిద్యలు సంపాదనా దారుల్ని తెరిచినవి. విశృంఖలత పెరిగి ఆడపిల్లల బతుకు ఆగం అవుతుంది.
‘‘తమ ప్రమేయం లేని అత్యాచారం వల్ల హెచ్.ఐ.వి. బారిన పడ్డ పిల్లల్ని చూస్తే జాలేస్తుంది.’’
‘‘వలస వెళ్ళి వచ్చిన భర్తల ద్వారా భార్యలకు ఏయిడ్స్ సోకిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఏయిడ్స్ వ్యాధి ఉన్న గర్భవతులు సరైన మందుల్ని, బలమైన ఆహారాన్ని తీసుకోకుంటే కడుపులోని పిల్లలకు సోకే ప్రమాదముంది’’ అన్నడు బుంగి.
మా ఆఫీసులో ఒకరికి ఏయిడ్స్ సోకింది మనిషి మంచిగనే కనిపిస్తడు. సరైన మందులు వాడుతడు. వాళ్ళావిడ ఆయన భోజనాదికాలపై చూపే శ్రద్ధ వింటే ఆశ్చర్యపోతం. సరైన సమయానికి భోజనం, అందులో ఆకుకూరలు, కూరగాయలు, మాంసం ఇలా వారానికి సరిపడా మెనూ నిర్ణయించి అతనికి వండి వడ్డిస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పని వ్యాయామం దగ్గరుండి చేయిస్తుందట. అతనికి సమతులాహారం, నిద్ర అందించటంలో ఆమెది ప్రధాన పాత్ర అని తెలిసింది. అయితే వీడికి ఆమె అంటే చిన్న చూపు ఎక్కువ.
‘‘సిరంజీలు, రక్తం, బ్లేడులు, పచ్చబొట్టు, సూదులు ద్వారా హెచ్‌ఐవి సోకుతుది. మీ వాడికి ఎట్లా సోకింది.’’
‘‘వీడు షోకుల పిల్లి, వ్యసన పరుడు, చెడు తిరుగుళ్ళు ఎక్కువ.’’
‘‘అతని భార్యకు కూడ సోకే  ప్రమాదముంది.’’ ఆందోళనగా అన్నడు బుంగి.
‘‘సోకడమే కాదు, వీడి ప్రవర్తన వల్ల ఆమె ఇపడు కాటికి దగ్గరయింది.’’
‘‘ఇక్కడ కూడా వివక్షేనా’’ నోరెళ్ళబెట్టిండు బుంగి.
వెలకాంత లెందరైనను
గులకాంతకు సాటిరారు కుంభినిలోనన్
బలువిద్య లెన్ని నేర్చిన
గుల విద్యకు సాటిరావు గువ్వల చెన్నా
గువ్వలచెన్న శతకం
గువ్వల చెన్న