ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పల్లె కవితా కథ--గులాబీల మల్లారెడ్డి 9440041351-- అది నాడొక నిరక్ష్యరాసుల పల్లె అప్పుడది ఒక మమతల పండు అనురాగ పరిమళాల పూల చెండు ఆ రోజుల్లో ఆ మట్టి మనుష్యులు శారీరకంగా మాత్రమే వేరువేరు పల్లెలో అందరిది ఒకటే హృదయము అప్పుడా పల్లె గుండె చప్పుడులో లబ్ డబ్ లబ్ డబ్ మాత్రమే వినిపించేది ఇప్పుడా రవళి డబ్ డబ్ డబ్బుగా మారింది ఇప్పుడా పల్లెలో ఇంటికో గ్రాడ్జువేట్ రెండిల్లకో పోస్ట్- గ్రాడ్జువేట్ మూడిళ్ళ కో డాక్టరేట్ ఆనాటి వనవాసుల వారసులే నేడు ఖండాంతర నివాసులు ఇప్పుడా పల్లెకు యవ్వన వసంతం లేదు ఎటుచూసినా పల్లెనిండా ఆరు పదుల వృద్దులే వార్ధక్యం చాయలే ఆనాడు ఏ నోట విన్నా ఎద్దు ఎవుసం చేను చెలుక ముచ్చట్లే పంట పాడి - కొడుకు కోడలు అచ్చట్లే నేడు యింటింటికి టివి సీరియల్ల ఆడ విలన్ల కథలే ఎటుచూసినా మదుమేహుల సెక్కరి బీమారి వెతలే
July 23, 2020 • T. VEDANTA SURY • Memories