ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పల్లె చిత్రాల రారాజు డా! కాపు రాజయ్య
August 21, 2020 • T. VEDANTA SURY • News

ప్రకృతిలోని అందమైన ప్రతి కదలికను కుంచె ద్వారా చిత్రంగా మలచి, అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన చిత్రకారులు డా! కాపు రాజయ్య అని కవులు ఉండ్రాళ్ళ రాజేశం, కోణం పర్శరాములు, బస్వ రాజ్ కుమార్ లు అన్నారు. కాపు రాజయ్య వర్థంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కుంచెతో రంగులద్ది బతుకమ్మ, బోనాలు, కృష్ణ గోపాలురు, గీత కార్మికులు ఇలా వందలాది చిత్రాలతో చిత్రకళ రారాజుగా వెలుగొందారన్నారు. సిద్దిపేట సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో ఎందరికో స్పూర్తిగా నిలిచిన కళారత్న కాపు రాజయ్య ఆదర్శప్రాయులన్నారు. పల్లె పట్టుత్వంతో  పొదిగినచిత్రాలు అంతర్జాతీయ ఖ్యాతి గడించి సిద్దిపేట పేరును నలు దిశలుగా వ్యాప్తి చేసిన కాపు రాజయ్య చిత్రాలు ప్రజా జీవనంలో సాగుతున్నాయన్నారు.