ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పల్లె_ముచ్చట్లు;- సరోజ పోచమల్లు
September 24, 2020 • T. VEDANTA SURY • Memories

పల్లెలల్ల పండుగ అత్తంది  అంటే మత్తు సంబురంగ, సందడిగ ఉంటది.గండ్ల ఇగ సద్దుల బతుకమ్మ అంటే మన తెలంగాణ ఆడి పొలిగాండ్లు మత్తు సంబురంగా జరుపుకునే పండగనాయే.
బొడ్డేమ్మ ఏసినాడి కాడి నుండి సురివ్ ఇగ ఎంగిలి పూల అమాసకు చిన్న బతుకమ్మ లు వేర్సి అడుడు సురువు అయితే సద్దుల బతుకమ్మ దాకా.మాపటేళ్ల కాంగనే బతుకమ్మ లు వెట్టి నాతిరి అయ్యే దాకా ఉయ్యాల పాటలు వాడుకుంట ఆడుకునేటోళ్లు..
పండుగంటే   సాన తయారు సేసుకోవాలి.
ఇగ ఊళ్లే పొంట సాల్లోళ్ల అన్న మూటలు వట్టుకొని బట్టలమ్మెతానికి అచ్చేది.ఇగ సెట్టుకింద మూటిప్పి కూకుంటే ఆడి ఆడ కట్టు అమ్మ,లక్కలంత అచ్చి ఇగ బట్టలు బేరమాడేది.
నేసిన సీరలు,దోతుల జోడలు,పట్టు సీరెలు ,ఎర్రంచు,పచ్చంచు దోతుల జోడలు,ఇగ ఆడి పొలగాండ్లను  లంగాలు,పట్టులంగాలు,సిల్క్ లంగాలు ,జాకెట్ బట్టలు ఇయ్యన్ని తాండ్లళ్ల తెచ్చి ఎవలికి ఎంత కావాలంటే అంత కొలత వెట్టి సింపి ఇచ్చేది.ఇగ మొగపోలగాండ్లకు బుసోట్ బట్ట,లాగు,నెక్కరు బట్ట తెచ్చిది,సిన్నపొలగాండ్లకు  గౌండ్లు ,సిన్న,సిన్న అంగీలు తెచ్చేది.
పల్లెల్ల  ఎవుసం పని సేయంగా ఎవళ్లు కూడా పట్నం బోయి దుకాణం ల కొనుక్కొనికి పోయేదికాదు.
గప్పుడే నాట్లు అయ్యి కలుపులు మొదలు అయ్యే ఇగ గా పని ఇడిసి పెట్టి.పోదాం అన్న గప్పుడు గియ్యన్ని మోటారు బండ్లు ఎక్కడియ్,ఎడ్ల కచ్చురం ల పోవుడు.
ఇగ పోవుటానికి అచ్చుటానికి ఓ దినం వట్టేది..ఇంత సద్ధి కట్టుకుని వోయి పొద్దుగాల మొదలు ఎడితే మాపటేళ్ల అయ్యేది..
గందుకే పని మునగ గొట్టుకోకుండా ఇట్ల ఊల్లెకు అమ్మచ్చిన మూటల దగ్గరనే కొనుకునేది.
ఇగ బేరమాడి గిట్టనిత్తే కొనేది లేకుంటే లేదు..మన సాల్లోళ్ల అన్న సిన్నోడా అంద రూపాయిల దాన్ని  రెండు అందలు సెప్పేది..
ఇగ మన అక్కలంత  బేరమాడంగా,బేరమాడంగా ధర గిట్టినంక కొనేది.గట్ల కూడా గిట్టలేదనుకో.
నువ్వేం అమ్ముతవ్ పో అని ఆ అన్నను అంటే మీరేం కొంటరు పో అని ఆ అన్న. బలే బేరం దొరికింది అని గులుగుకుంటా అక్కడి కెల్లి పోయేది..
అబ్బో గిదంత బట్టలు కొనుడు మట్టుకె. ఇంకా సాన కథఉంది.
ఇగ తతిమ్మ ముచ్చట తరువాత --
S... N.