ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పసితనం వాడిపోవద్దు --కె ఎస్ అనంతాచార్య.
September 8, 2020 • T. VEDANTA SURY • Poem

నామకరణం రోజున
తొట్లే లో వేసే సంప్రదాయం నుండే
మొదలయ్యే క్రీడావిద్య
పాలనవ్వుల మురిపాల బాల్యo
వానావల్లప్పంటూ
చేతులు చాచాలి
కాగితం పడవలై నీటిమీద తేలియాడాలి
ఆటపాటల లోన
చదువులలోన మేటి కన్నయ్యను చూసి
చిన్నయ్యలను సాకుదాం
లేగ దూడల వెంబడి
గంతులేసి పక్షుల గొంతులో పలికి
సావస గాండ్రకు కో ఇచ్చిన లెప్రాయపు
వికాసపు జాడలెక్కడ?
కలువల కన్నులకు
ఇప్పుడు రంగుల కళ్ళద్దాలు!
అట్లతద్దేల డోలికా విహృతులు లేవు
ఆడపిల్లల సందళ్ళు లేవు
లేత దేహాలిప్పుడు
ఆటలకు టాటా చెప్పి
ఈ-చదువుల్లో బందీలై
జీవకళ తప్పి సోలి పోతున్నాయి
పాము మింగినా పట్టుదలతో
 పైకి రమ్మని చెప్పే వైకుంఠపాళీ లేక
 పరీక్షలు తప్పిన తలలు ఫానుకు
వేలాడుతున్నాయి 
చిట్టి చేతులకు ఓపికల్లేవు 
 చదువులకు దేహ
దారుఢ్యానికి మధ్య
పొంతన కుదరక
 సంపూర్ణ మూర్తిమత్వo
 పుస్తకాల్లో  పడుకుంది
బడిలో 
వ్యాయామ గంట మోగక
ఆధునిక జీవన శైలిలో
అంతా గందరగోళం
కాస్త ఎండను 
తినిపిద్దాo
 బయళ్లలో అడుగులకు పచ్చని స్పర్శానుభావాన్ని
కలిగిద్దాం
యాంత్రిక జీవనం లో
మనసుకు ఆహ్లాదాన్ని
కలిగిద్దాం 
పసి ప్రాయాన్ని వాడనివ్వక
ఆడనిద్దాం !