ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పసిపాపలు.: --మొహమ్మద్ .అఫ్సర వలీషా -ద్వారపూడి (తూ గో జి )
November 3, 2020 • T. VEDANTA SURY • Poem

బాలలూ....

తూగుటుయ్యాల 
ఊగినట్లే ఉంటుంది కదా
అమ్మ ఒడిలో 
తలపెట్టు కుంటే...

ఈ ప్రపంచాన్నే 
మర్చి పోయినట్లుంటుంది కదా
నాన్న భుజాలపై
ఊరేగుతుంటే....

భువిలో అదృష్ట వంతులు
లేరనిపిస్తుంది కదా
అమ్మ నాన్నా కొసరి
కొసరి తినిపిస్తుంటే....

మనము ఏనాడూ 
మరవకూడదు కదా
అమ్మా నాన్నలే 
మన ప్రత్యక్ష దైవాలని....

నేటి బాలురే 
రేపటి పౌరులైతే
నేటి అమ్మా నాన్నలే
రేపటి పసిపాపలు కదా.....!!