ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పసి హృదయా -- కళావతి కందగట్ల--9948263004
November 3, 2020 • T. VEDANTA SURY • Poem

కొందరు దంపతులు" బయట"
ప్రేమ మమకారాలు
లోన" కారాలు మిరియాలు


కొందరు ప్రేమికులు "బయట"
అంతులేని అంతులేని ప్రేమలు
"లోన " అంతంలేని అనుమానాలు

కొందరు అత్తా కోడళ్ళు" బయట"
గౌరవ మర్యాదలు
"లోన" ఎత్తుకు పై ఎత్తులు

కొందరు స్నేహితులు "బయట"
ఆప్యాయత అనురాగాలు
"లోన" అసూయా ద్వేషాలు

            కాని
పసి హృదయాలు బయట..లోనా
ఒకటే..అవే "కల్మషం లేని నవ్వులు