ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పసుపు --ఔషధంగా... :పి . కమలాకర్ రావు
October 13, 2020 • T. VEDANTA SURY • health tips

భారతీయ జీవన విధానంలో పసుపు ప్రముఖ పాత్ర వహిస్తోంది. ప్రతి ఇంటి ముందు గడపకు పసుపు పసుపు తో తయారైన కుంకుమ ఆహ్వానం పలుకుతుంది. గడపకు పసుపు రాస్తే ఇంటి లోపలికి సూక్ష్మజీవులను రానివ్వదు. ఏ చిన్న దెబ్బ తగిలి చర్మం నుండి రక్తం కారిన వెంటనే పసుపు అద్దితే రక్తాన్ని ఆపుతుంది యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. దంత సమస్యలకు పసుపు సైంధవ లవణం లో కొద్దిగా ఆవనూనె కలిపి పళ్ళు తోముకుంటే చిగుళ్ల వాపు తగ్గి చిగుళ్ల నుండి రక్తం కారడం కూడా ఆగిపోతుంది. కీళ్లనొప్పి సమస్య ఎక్కువ అయినప్పుడు నీటిలో కొద్దిగా పసుపు వేసి సొంటి పొడి, మెంతి పొడి కూడా వేసి కషాయంగా కాచి చల్లార్చి త్రాగాలి కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. చిన్న పిల్లలకు జలుబు వచ్చినప్పుడు పాలల్లో పసుపు వేసి కొద్దిగా బెల్లం వేసి త్రాగితే జలుబు తగ్గిపోతుంది ప్రమేహ వ్యాధిలో నీటిలో పసుపు వేసి ఉసిరికాయ రసం కూడా కలిపి త్రాగితే మంచి గుణం కనిపిస్తుంది క్యాన్సర్ వ్యాధికి కూడా పసుపు మంచి ఔషధం. దీనిని ప్రకృతి సిద్ధమైన స్టెరాయిడ్ అంటారు. చర్మ వ్యాధులు రాకుండా కూడా పసుపు కాపాడుతుంది. అన్ని వంటకాల్లో పసుపును విధిగా వాడతాం. ఆరోగ్యాన్ని కాపాడు కుంటాం.