ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పాపం జంతువులు.--రచన. పోలయ్య కవి కూకట్లపల్లి, హైదరాబాద్ - 9110784502
September 14, 2020 • T. VEDANTA SURY • Poem

ఓ పిల్లలూ !
ఆకాశంలో 
ఏమేమున్నాయో తెలుసా 
భూమండలానికి 
వెలుగునిచ్చేసూర్యుడు 
చల్లని చంద్రుడు 
నల్లనిమేఘాలు నక్షత్రాలు
భూమిలో ఏమున్నాయో తెలుసా 
పక్షులు జంతువులు మనుషులు 
పచ్చనివృక్షాలు ఎత్తయిన పర్వతాలు 
నదులు సముద్రాలు 
కొండలు కోనలు 
గలగలపారే సెలయేళ్ళు 
జలజలదూకే జలపాతాలు 
అయితే మనిషి 
ఈ భూమిని దున్నగలడు 
పచ్చని పంటలు పండించగలడు 
రాజ్యాలను ఏలగలడు 
సప్తసముద్రాలను ఈదగలడు
ఆకాశంలో పక్షులవలె 
విమానాలలో వివరించగలడు 
అలాగే పక్షులు కూడా 
ఆకాశంలో ఎగరగలవు కానీ 
పాపం జంతువులే 
ఆకాశంలో ఎగరలేవు 
స్వేచ్చగా‌ విహరించలేవు 
కారణం వాటికి రెక్కలులేవు గనుక 
అందుకే ఈ భువిలో మనిషి జన్మే 
అన్నిటికన్నా ఉత్తమమైనది 
ఉత్కృష్టమైనది ఉన్నతమైనది
పిల్లలారా ! మీరు కూడా 
ఈ మానవజన్మ విశిష్టతను తెలుసుకోండి 
భావిభారత పౌరులుగా ఎదగండి.జైహింద్