ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పారదర్శకత--కె ఎస్ అనంతాచార్య
September 27, 2020 • T. VEDANTA SURY • Poem

చేతుల్లో, మాటల్లో
నడకల్లో, నడతల్లో
అన్నింటా అద్దంలో
ప్రతిబింబమై మెరవాలి

ఒక చూపులోంచి
భావపరంపరలు
ద్యోతక మయ్యే అంత:సూత్రం  

చేతలెప్పుడూ మాటల ప్రతిరూపాలుగా
రాతలెప్పుడు 
ఆచరణలయితే అందరు పాడుకొనే పాటల చరణా లైతాయి


ప్రభుతకు జనతకు 
మధ్య వంకలు తొలగించుకొని
వoచనలు
త్రుంచుకొని   సాగిపోయే సమరస భావం  

తేలుకుట్టిన దొంగల రహస్యం బేధించినప్పుడే జట్టుకు ఐక్యతా బలం
రెండింతలవుతుంది

 దాపరికం లేని రహస్యాలు 
సదా చర్చల్లో ఎగిసి పడాలి

ఉద్యోగ ధర్మంలో మర్మాల నెరిగి
చెవులు కొరికే వారికి
చేటంత సత్యాన్ని ఆరబోయాలి

బంతిలో పలపక్షం
లేకుండా చదువరులందరికీ
తలాయింత సమానత్వం పంచాలి

మనసు దుమ్ము దులిపినపుడే ఆత్మ దర్పణంలోంచి గుణవర్ణ ధనస్సు ఉద్భవిస్తుంది

నీతి నిజాయితీలు
మానవులలో జ్యోతులై వెలగడంకన్నా పారదర్శకత వేరే లేదు