ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పారశీక కవి రూమీ--పారశీక కలి జలాలుద్దీన్ రూమీ కవితలను మొట్టమదటిసారిగా నేను చదివినది తమిళంలోనే. తర్వాతనే తెలుగు, ఇంగ్లీషులలో చదివాను దాదాపు ఏడాదిన్నర క్రితం ఓ శుభకార్యం నిమిత్తం మద్రాసు వెళ్ళినప్పుడు తమిళంలో ఎన్. సత్యమూర్తి అనువాద రూమీ కవితలు చదివాను ఓ మిత్రుడి మాటగా.. సత్యమూర్తి అనంవాదరచన పుస్తకం కవితలతో పాటు బొమ్మలతో కూడినది. ఇలా బొమ్మలతో చూడటం అదేమొదటిసారి.కోల్మన్ ఇంగ్లీషులో అనంవదించిన THE ESSENTIAL RUMI పుస్తకం ఆధారంతో సత్యమూర్తి తన అనువాదాలు కొనసాగించారు. కవితా ప్రక్రియపై ఆసక్తి ఉంటేనే రూమీ కవితలలోని గాఢత బోధపడి ఆస్వాదించగలం. రూమీ కవితలను ఎలా అర్థం చేసుకోవాలి...చూసేందుకు ప్రేమకవితలలా అనిపించి సులభంగా చదివేయొచ్చు అని అనుకుంటాం. కానీ అది సరికాదు.రూమీ ఓ సూఫీ జ్ఞాని. రూమీ ప్రేమ, పరవశం కూడిన కవితలై అర్థం చేసుకోవడానికి అందుకు సంబంధించిన జ్ఞానాన్ని మనసులో ఉంచుకుని చదివితే ఆయన రచనలలోని లోతు అవగతమవుతుంది.రూమీ కవితలంటే పిచ్చి కనుక మరొక్కసారి తమిళ అనువాదం చదివాను.పన్నెండో శతాబ్దానికి చెందిన కవి, తత్వజ్ఞాని రూమీ. సూఫీ కవితలు చదివేవారికి అందులోని నిరాడంబరం, ప్రత్యక్ష తత్వం ఏముంది అర్థంకాకపోవడానికి అని అనిపిస్తుంది. ఆధునిక వచన కవితలు చదివేవారికైతే రూమీ రచనలు చాలా మామూలుగా అనిపిస్తాయి. కవితల ఉన్నత స్థితిలో ప్రార్థన ఒకటి. ఆధునిక కవితలు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోవు. ప్రార్థనతో కూడిన కవిత పవిత్రమైనది. భగవంతుడు అనే అంశానికి కాస్త ఎడంగానే ఆధునిక కవితలు ఉంటాయి. సూఫీ కవితలలో ప్రేమ అనేది సరాసరి భగవంతుడితో ముడిపడినది జ్ఞానం, ఆత్మ, సత్యాన్ని తెలుసుకోవడం ముఖ్యం. ఇలాంటివి రాసే వారిని ఒకింత పురాతనకవిగా జమకట్టే వారూ లేకపోలేదు. సూఫీ కవితలలో చోటుచేసుకున్న గులాబీ అనేది సృష్టి అందానికి ప్రతిరూపం.గులాబీ తోట అనేది స్వర్గొనికి సంకేతం. సూర్యుడు అనేది జ్ఞానానికి చిహ్నం. ఆకాశమనేది ఆత్మ రూపం. వసంతం అనేది ఐక్యం.ఇలా సూఫీ కవితలకు ఇటువంటివి ముఖ్యమైన సంకేతాలు.ఒక చుక్క అత్తరుని మీ దేహానికి పూసుకోవడంతో మీరూ పరిమళభరితులవుతారుశమ.మీ చెంత ఉన్న వారూ గులాబీ పరిమళాన్ని ఆస్వాదిస్తారు.మరో మాటలో చెప్పాలంటే మీరు నడయాడే ఓ గులాబీ వనం.సూఫీ కవిత అత్తరులాంంటిది కవిత పరిమళం మనలో లోపలా వెలుపలా ఓ కొత్తదనాన్ని కల్పిస్తుంది.సూఫీ కవితలు చదవడం అనేది సువాసన ద్రవ్యాలను ఆఘ్రాణించడంలాటిదే. మనసుకి పట్టించడంలాటిదే.అత్తరు సువాసన మనల్ని ఎలా పరవశింప చేస్తుందో అలాంటిదే సూఫీ సంగీతంకూడా.ఈ రెండింటి సంగమమే సూఫీ కవితలు. ఈ కవితలలో చెప్పే ప్రేమ దేహానికి సంబంధించినది కాదు. కవితలో వచ్చే కన్య కూడా ఓ సంకేతమే. ప్రేమ తపన దేహానికి సంబంధించినది కాదు. విముక్తి కోసం చేసే అన్వేషణే. సూఫీ కవితలు నిశ్శబ్ద సంగీతాన్ని ప్రస్తావిస్తుంది. మౌన వశీకరణను లోతును చెప్తాయి.సూఫీ కవితలు నేను అనే భావానికి అతీతం.సూఫీ కవితలను అర్థం చేసుకుంటే అంతకన్నా ఆనందం ఇంకెక్కడా పొందలేం.ఈ కవితలు ధ్యానమంత్రాలవుతాయి.రూమీ కవితలు ఓ నాట్యమే. కవితలలోని గాఢతతో మమేకమవుతో మనసు ఎటో పోతుంది. జ్ఞానాన్వేషణకు ఉపకరణంలాటిది సూఫీ కవిత. ఇది బోధపడితే రూమీ కవితల అంతరార్థాన్ని గ్రహించడం సులభం.ప్రేమ నా అలవాట్లను తీసేసుకుని కవితలతో నన్ను పూరించింందని చెప్పిన రూమీ రచనలను అనువదించ డమనేది ఓ ధ్యానంలాంటిదే. ఈ ధ్యానం ద్వారా జ్ఞాన రహస్య తోటలోకి ప్రవేశించవచ్చు. విచిత్రాలను తెలుసుకోవచ్చు.రూమీ అంటాడొక చోట.... భగవంతుడా నీకు ధన్యవాదాలు! కన్నీరు వర్ణరహితం లేకుంటే నా తలగడ నా హృదయాన్ని బయటపెట్టేసేదే నమ్మకద్రోహం చేసేదే 2 నేను శ్వాసీంచేది గాలిని మాత్రమే కాదు నీ ప్రేమనుకూడా 3 భగవంతుడికీ ఆశ్చర్యమే దారి పొడవునా నీ ప్రేమ పుష్పాలే పరచుకున్నాయి 4 నువ్వు లేకపోవడంలోని అద్భుతమేంటో తెలుసా నీకోసం జరిపే అన్వేషణలో నన్ను నేను తెలుసుకున్నాను 5 నిన్న రాత్రి నీ జ్ఞాపకం నా హృదయంలోకి జొరబడి దోచుకుంది అదెలాటిదో తెలుసా వసంతం నగ్న వనంలోకి ప్రవేశించిన అతిథనుకో 6 నా కన్నీళ్ళు మంచుబిందువులనుకో 7 ప్రేమకు సహనం ప్రధానం 8 మాట్లాడు నీ పెదవులు సొతంత్రమైతే మాట్లాడు నీ నాలుక ఇప్పటికీ నీసొంతమైతే నీ దేహం నీ అధీనంలో ఉన్నట్లయితే మాట్లాడు నీ జీవితం నీదంటూ అయితే - యామిజాల జగదీశ్
August 19, 2020 • T. VEDANTA SURY • Book Review