ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పిల్లలకోడీ:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 21, 2020 • T. VEDANTA SURY • Poem

పిల్లలకోడీ ఎక్కడున్నావ్?
పిల్లలతోనీ గంపకిందున్నా!
పిల్లలకోడీ ఎక్కడున్నావ్?
పిల్లలకోసం గింజలేరుతున్నా!
పిల్లలకోడీ ఎక్కడున్నావ్?
పిల్లలకోసం తిండితెస్తున్నా!
పిల్లలకోడీ ఎక్కడున్నావ్?
పిల్లలకోసం వెతుకుతున్నా!
పిల్లలకోడీ ఎక్కడున్నావ్?
పిల్లలకోసం చూస్తున్నా!
పిల్లలకోడీ ఎక్కడున్నావ్?
పిల్లలతోనీ కూర్చున్నా!
పిల్లలకోడీ ఎక్కడున్నావ్?
పిల్లలతోనీ గంపకిందున్నా!
పిల్లలు ఎక్కడ కనబడరేం?
రెక్కలకిందా దాచేసుకున్నా!!!