ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పిల్లలహక్కు:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 7, 2020 • T. VEDANTA SURY • Poem

ఆటలు పాటలు పిల్లలహక్కు
అల్లరి చేతలు పిల్లలహక్కు
నడకలు పరుగులు పిల్లలహక్కు
హాయిగ తిరుగుట పిల్లలహక్కు
మారాం చేయుట పిల్లలహక్కు
తాయిలం కోరుట పిల్లలహక్కు
బడిలో చేరుట పిల్లలహక్కు
చదువుట రాయుట పిల్లలహక్కు
జ్ఞానము నేర్చుట పిల్లలహక్కు !!