ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పిల్లలు వెలుగుదివ్వెలు: -- జగదీశ్ యామిజాల
November 1, 2020 • T. VEDANTA SURY • Poem
 • పిల్లలు
  అద్భుతాలకూ
  అపురూపాలకూ
  ప్రతిరూపాలు
 • పిల్లలు
  దేవుడిచ్చిన కానుకలు
  కనుకే
  వారితో ఉంటున్నంతసేపూ
  మనసులో 
  ఏ కల్మషాలూ 
  ఏ కలతలూ ఉండవు
  అసలవి స్ఫురణకే రావు
 • క్షణాలు గుర్తుకు రావు
  అల్లంతలోనే క్షణాలన్నీ కరిగిపోయేయా
  అన్పిస్తుంది
  పిల్లలనుంచి ఇవతలకు
  వచ్చినప్పుడు
 • పిల్లల్లై పిల్లలతో కలసిమెలసి
  కాలాన్ని గడిపెయ్యాలి
 • పెరిగి పెద్దవడాన్నెవరూ 
  అడ్డుకోలేరూ కానీ
  మనసునిండా
  పసితనాన్ని నింపుకోవడాన్నెవరూ
  ఆపలేరు
 • జీవితాంతం 
  పిల్లల మనస్తత్వం 
  కలిగి ఉంటే
  ఎంత హాయో అనుభవజ్ఞులకే
  తెలుస్తుంది
 • పెద్దలెన్ని సుద్దులు చెప్పినా
  పిల్లలకూ 
  మంచితనాన్ని చెప్పడంలో
  ఎప్పుడూ ఆలోచించక్కర్లేదు
 • పిల్లలూ!
  మిమ్మల్నీ
  మీ కలలనూ చెక్కాలనుకునే
  శిల్పులతో నిర్మొహమాటంగా 
  చెప్పండి....
 • "మీ చనువుతో
  మీ తొందరపాటుతో
  మా కలలను ముక్కలు చేయకండి
  మా కలల పంట 
  పండేందుకు దోహదపడండి తప్ప
  నిద్రపుచ్చకండని"