ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పిల్లల మాటలు:--రావిపల్లి వాసుదేవరావుపార్వతీపురం 9441713136.
September 27, 2020 • T. VEDANTA SURY • Poem

మాటలు మాటలు
పిల్లల మాటలు
వీనుల విందుగా
వుండే మాటలు

కధలు చెప్పుతూ
కళ్ళు తిప్పుతూ
మురిపించేటి
ముద్దు మాటలు

ఆడేటప్పుడు
తలను తిప్పుతూ
నవ్వించేటి
చక్కని మాటలు

అమ్మ కోప్పడితే
మూతి తిప్పుతూ
మాట్లాడేటి
ముద్ద మాటలు

నాన్న నేర్పేటి
మాటలు వింటూ
తిరిగి చెప్పేటి
మాటల మూటలు

దేవుని మొక్కుతూ
పద్యము చదువుతూ
మైమరిపించే
మంచి మాటలు

ప్రతీఇంటిలో
అందరి మనసును
అలరించేటి
పిల్లల మాటలు