ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పీవీకి భారతరత్న ఇవ్వాలి: పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశ గతిని మార్చినవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు నేనే స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొ న్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలచుకునేలా, చిరస్మర ణీయంగా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాదంతా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.పీవీ జన్మదినమైన జూన్‌ 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞాన భూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరిమితంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటానని, అదే రోజు దాదాపు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తామని, మంత్రి కేటీఆర్‌ ఈ కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షిస్తారని సీఎం వెల్లడించారు. ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్ల కేటాయిస్తున్నట్లు ప్రకటిం చారు. రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలను బట్టి, నిధులు విడుదల చేసుకుంటూ పోతామన్నారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌ కె.కేశవరావు, మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సలహాదారు రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి సోమేశ్‌కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, పీవీ నరసింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్‌ రావు, కుమార్తె వాణిదేవి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.ఉత్సవాల నిర్వహణలో భాగం గా చేయాల్సిన కార్యక్రమాలను సీఎం నిర్దేశించారు.(సాక్షి సౌజన్యంతో )
June 24, 2020 • T. VEDANTA SURY • News