ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పుట్టినరోజు--కె ఎస్ అనంతాచార్య-- పండుగే అందరికి శైశవం తిరిగొచ్చి తనువులో చొచ్చి ఆనంద మేఘమై కురిపించే అద్భుత వర్షం సంబరం అందనంత సాధించింది ఇసుమంత బర్త్ డేలు వెర్రి తలలు వేసి సృజియించే భయాందోళనలై రాదు బతుకు పొద్దెక్కి నా కూడా వీడని మధుర జ్ఞాపకాలు కాల్చే కాండీల్స్ చెపుతున్న పాఠం వయస్సు తరిగిపోతుందనే! కేకులు కోస్తున్నామా సంస్కృతి ని ముక్కలు చేస్తున్నామా తెలియని వెర్రి పూన కాలు పూసుకోవడాలు సంతోషానికి అర్థం మారింది మిత్రులంటే లిక్కర్ లో కలుపుకునే సోడా పొంగు కాదు అంపశయ్య పైన కొట్టు మిట్టా డే జీవికి ప్రాణం పోసి రక్తంలో కలిసి పోయె ధీమా! అర్థించే గుండెకు అసరాగా నిలిస్తే అంతకన్నా పెద్ద సందర్భమేది మనిషిగా పుట్టటం ఓ అవకాశం కోర్కెలు జయించిన మహావీరుడవైతే బ్రతుకే ఆనందం
August 8, 2020 • T. VEDANTA SURY • Poem