ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పుట్టిన రోజంటే ..--డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,-హనంకొండ ,వరంగల్ .-9866252002-8886991785
October 6, 2020 • T. VEDANTA SURY • Poem

"పుట్టిన రోజు 
పండుగే అందరికీ ,
పుట్టింది ఎందుకో ,
తెలిసేది ఎందరికి ?"
అన్నాడొక సినీ కవి 
నిజమేకదా ....
దానిగురించి తెలిసేది 
కొందరికే మరి ...!

జ్ఞానం వచ్చేవరకూ ,
ఆలోచించడం ..
తెలిసేవరకూ ...
బాల్య దశ దాటేవరకూ ,

జన్మ దినం అంటే ..
నూతన వస్త్రాలు ,
ధరించడం .......

పిల్లలకు చాకోలెట్లు 
పంచడం .....

కేకు కట్ చేయడం ,
చర్చిలో ..గుడిలో ...
మసీదులో ..గురుద్వారాలో ,
ప్రార్ధనలు --
చేయించుకోవడం ,

పాయసాలు -పులిహోరాలు 
సేవించడం ...
రచికరమైన ఆహారం 
అనందంగా ఆరగించడం ,
స్థాయినిబట్టి అందరికి ,
సమస్తమూ కుదురుతాయ్ !

బాధ్యతలు ...
భుజాలమీదికి వాలేసరికి ,
పుట్టినరోజంటే ....
గతాన్ని గుర్తు చేసుకోవడం ,
వర్తమానాన్ని -
అదుపుచేసుకోవడం ,
భవిష్యత్తుకు ...
బంగారు బాట వేసుకునే ,
వ్యూహం రచించుకోవడం !!