ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పువ్వులు--ఉండ్రాళ్ళ రాజేశం
September 6, 2020 • T. VEDANTA SURY

పువ్వులమ్మ పువ్వులు
అంగట్లో హరివిల్లులు
!! పువ్వులు!!
బంతిపూల మాలలు
దేవుడి మెడలో హారాలు
రంగు రంగుల దండలు
సత్కారాల పరిమళంబులు
!! పువ్వులు!!
తెగిన పూల రెక్కలు
రాజులు, ధనవంతులకు బాటలు
మల్లె, చామంతి మూరలు
మగువల జడలలో సొబగులు
!! పువ్వులు!!
గులాబీల పూగుత్తులు
బాల కృష్ణుల సయ్యాటలు
పూలగంపల పరుగులు
అమరుల ఒడిన కన్నీటి దివ్వెలు
!! పువ్వులు!!