ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పువ్వు లు...డా .కె .ఎల్ .వి.ప్రసాద్ ,--హనంకొండ ,వరంగల్ .--9866252002--8886991785
September 29, 2020 • T. VEDANTA SURY • Poem

పువ్వులు -పువ్వులు 
ఎటుచూసినా పువ్వులు 
ఋతువులతో 
పనిలేని పువ్వులు 
నిత్యం పరిమళించే 
రంగురంగుల పూలు 
అందమైన పూలు ...!

ఆడ -మగ ,తేడా లేకుండా,
అందరినీ ఆకర్షిం చి ....
మనసును మత్తెక్కిం చే,
గులాబీలు -చామంతులు ,
సన్నజాజులు -సంపెంగలు ,
విరజాజులు -లిల్లీలు,
మల్లెపూలు-నైట్ క్వీన్ ,
ఒకటేమిటి ..ఎన్నెన్నో ...

పువ్వులు -పువ్వులు,
ఆహ్లాదంగా పువ్వులు 
అమ్మల కొప్పుల్లో..
ఆడపిల్లల జడ ల్లో,
అందంగా అమి రే
 పువ్వు లు......
దైవపూజ లో ....
శుచిగా చల్లబడే పువ్వులు,
సన్మానాల్లో -గౌరవంగా ,
వధూవరుల మెడలో
బుద్దిగా వొదిగే పువ్వులు,!

సువాసనలు వెదజల్లే....
 సుందరమైనపువ్వులు ..!
సెంటు తయారీలో.....
కీలకమైన పువ్వులు ...
పువ్వులు ..పువ్వులు ..
చక్కనైన పువ్వులు ....
సుగంధ భరిత పువ్వులు !!