ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పుష్కరుని పుట్టుక.బేతాళకథ--.డా.బెల్లంకొండ.నాగేశ్వర రావు , చెన్నై-- చెట్టుపైనున్న బేతాళుని బంధించి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు విక్రమార్కుడు.విక్రమార్కుని భుజం పై ఉన్ని శవాన్నిఆవహించి ఉన్న బేతాళుడు. "మహీపాల నీవు పట్టుదలకు మారు పేరు. అహింస,సత్యం,అస్తేయం, అసగం,హ్రీ,అసంచయం,ఆస్తీక్యం,బ్రహ్మచర్యం,మౌనం,స్థైర్యం, క్షమ, అభయం, అనే యామాలు తెలిసిన నీవు నాసందేహం తీర్చాలి.నాకు చాలా కాలంగా తెలియని ఒక విషయం నిన్ను అడుగు తున్నాను,మానవాళికి పుణ్య ప్రదమైన పుష్కర స్నానం ఎలావచ్చింది.తెలియజేయి.తెలిసి చెప్పక పోయావో నీతల పగిలి మరణిస్తావు. " బేతాళా పుష్కర స్నానం అమోఘ ఫలం.నర్మదా నది తీరంలో తపస్సు,గంగానదీ లో నిత్యం ప్రాతః కాలస్నానఫలం,గంగా యమునల సంగమ స్ధలంలో ప్రతిదినం పుణ్యస్నాన ఫలం,కురుక్షేత్ర ప్రాంతంలో దానం,వారణాశి (కాశి)మరణం వలన ఎటువంటి పుణ్యఫలం కలుగుతుందో పుష్కరనదీ స్నానం కూడా అదే ఫలితాలు ఇస్తుందని శాస్త్రాలు చెపుతున్నాయిపుష్కరస్నానం వేకువన ఉత్తమమని,మద్యాహ్నవేళ మధ్యమంఅని, సాయంకాలంవేళ అధమం అని అంటారు.ఇంటివద్ద స్నానం చేసాకే పుష్కర నది స్నానం చేయాలి.నదిలో దిగేముందు....'పిప్పలాద సముత్పన్నే కృత్య లోక భయంకరీబేమృత్తికాంతే మయాదత్తం ఆహారార్థం ప్రకల్పయ'అని చెప్పుకుని గట్టున ఉన్నమట్టికి కొద్దిగా నదిలో మూడు సార్లు వేసి,పుష్కరస్నానంచేయాలి.లేదంటే పుష్కర స్నానఫలం దక్కదని పెద్దలు చెపుతారు. ఈ శ్లోకం చెప్పుకునే సమయంలో మహిళలైతే 'మృత్తికాం'అన్నచోట 'హరిద్ర'అని పలకాలి. వారు మట్టికి బదులు పసుపు కుంకుమలు సమర్పించాలి.దీని వెనుక ఒక కథ ఉంది.పిప్పిలాదుడు అనే మహర్షి యాగం చేస్తుండగా యజ్ఞకుండం లోనుండి కృత్యఅనే వాడు ఉద్బవించాడు. వాడు పుట్టుకతోనే ఆకలి అంటూ దేవతలను కబళించ చూసాడు.అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై 'నిన్ను తలచుకుని నదీ స్నానం చేసేవారి పుణ్యఫలం తిందువులే' అనివరం ఇచ్చాడుపుష్కరుని పుట్టుక.పూర్వం ముద్గలుడు అనే తపస్వి శివుని తన తపస్సు తో మెప్పించి తనని శివునిలో ఐక్యంచేసుకోమని,జలరూపంలో సకలప్రాణలకు దాహార్తి తీరుస్తూ,వారి దుష్కర్మలను తీర్చేలా వరం కోరాడు.అనుగ్రహించినశివుడు అష్ట రూపాలలో ఒకటైన జలరూపంలో ముద్గలుని తనలో కలుపుకుని'పుష్కరుడు'అనే పేరు పెట్టి బ్రహ్మ దేవుని కమండలంలో నివాసం కలిగించాడు.అహల్య పట్ల అనుచితంగా ప్రవర్తించి గౌతమ ముని శాపం పొందిన ఇంద్రుడు బ్రహ్మను శరణు వేడగా తన కమండలం లోని నీటితో అనుగ్రహించాడు.అలా పుష్కరుని మహత్తు సర్వ లోకాలకు తెలిసింది.పుష్కరుని మహత్తు సమస్త సృష్టికి అందించాలని దేవతల గురువు 'బృహస్పతి' బ్రహ్మను వేడుకున్నాడు.బృహస్పతి విన్నపాన్ని మన్నించిన బ్రహ్మ సకల శుభాలను కలిగించే గురుడు సంవత్సరానికి ఒక్కోక్క రాశి చొప్పున పన్నెండు సంచరిస్తుంటాడు.ఒక్కో రాశి లో గురుడు ప్రవేశించే సమయంలో పన్నెండు రోజుల పాటు పుష్కరుడు ఉండేలా అనుగ్రహించాడు.గురుడు కన్యరాశిలో ఉండగా 'కృష్ణానది'కి,తులరాశిలో ప్రవేశించగా 'కావేరినది'కి, వృశ్ఛకరాశిలో'భీమారధి'(తామ్రపర్ణి)కి,ధనస్సులో 'పుష్కరిణి'కి,మకరంలో 'తుంగభద్రా'కుంభ రాశిలో'సింధూనది 'కి , మీనరాశి లో'ప్రణితానది'కి,మేషరాశిలో 'గంగనది'కి,వృషభ రాశికి 'సరస్వతినది'కి,కర్కాటక రాశిలో'యమునానది 'కి,సింహారాశిలో 'గోదావరి'కి పుష్కరాలు వస్తాయి.పోషయతీత పుష్కరం-పుష్కరం అంటే పోషించేది అని అర్ధం.పుష్కరాలలో పిండ ప్రదానలతోపాటు,దానంకూడా చేయడం ఆనవాయితి.పుష్కరాలు జరిగే పన్నెండు రోజుల దానాలు.మెదటిరోజు భూ,ధాన్య,సువర్ణ, రజిత, అన్నదానం.రెండోరోజు రత్న,గో,వస్త్ర,లవణ,దానాలు.మూడవరోజు పండ్లు, కూరగాయలు. నాలుగోరోజు తేనె,నెయి,పాలు,నూనె. ఐదవరోజు వ్యవసాయ సంభందిత దానాలు.ఆరోరోజు ఔషద దానం.ఏడో రోజు మంచం,పీట వంటి ఇంట్లో వాడుకునేవి.ఎనిమిదోరోజు దుంపలు.తొమ్మిదో రోజు దుప్పట్లు,కంబళ్ళు.పదోరోజు నవరత్నాలలో ఏవైనా.పదకొండో రోజు పుస్తకాలు.పన్నెండో రోజు నువ్వులు దానంచేయాలి. ముక్కోటి దేవతలు పుష్కర స్నానాలకు దిగి వస్తారని నమ్మకం. ఆసమయంలో పిండప్రదానంచేస్తే సమస్త నదీ తీరాలలో పిండప్రదానం చేసిన ఫలం కలుగుతుందంటారు.తల్లి తండ్రులు,బంధువులు,ఆశ్రయం ఇచ్చినవారు,విద్యనేర్పినవారు,అన్నం పెట్టినవారు,సేవకులు ,స్నేహితులు పిండప్రదదానార్హులు"అన్నాడు విక్రమార్కుడు.విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతోసహా మాయమై చెట్టు పైకి చేరాడు బేతాళుడు.పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై మరలా వెనుతిరిగాడు.
July 24, 2020 • T. VEDANTA SURY • Story