ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పెద్దపులి కొబ్బరిచెట్టు (పునఃకథనం)--డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212-- ఒక రోజు పొద్దున్నే కుందేలు ఆహారం కోసం బైలుదేరింది. కొంచం దూరం పోయిందో లేదో దానికి ఒక పెద్దపులి ఎదురొచ్చింది. ఆ పెద్దపులి కుందేలును చూడగానే దానిని పట్టుకోడానికి మీదకు దూకింది.కుందేలు వణికి పోతూ పరిగెత్తడం మొదలు పెట్టింది. ఒక చోట ఆ కుందేలుకి చెట్టు మీద ఒక కోతి కనబడింది. కుందేలు కోతితో “కోతి బావా... కోతిబావా... పెద్దపులి నన్ను చంపాలని వెంట పడింది. ఎలాగైనా కాపాడవా” అంది.కోతి పకపక నవ్వి అప్పుడే అక్కడకు వచ్చిన పెద్దపులిని చూసి “ఏందీ... ఈ పెద్దపులిని చూసి నీవు భయపడుతున్నావా? ఇది ముసలిదైపోయింది. దీనికి కొంచం గూడా బలం లేదు. చేతనైతే అదిగో ఆ కొబ్బరి చెట్టును ఊపమను చుద్దాం” అంటూ పక్కనే ఉన్న కొబ్బరి చెట్టును చూపించింది.ఆ మాటలు విన్న పెద్దపులికి చానా కోపం వచ్చింది. వెంటనే ఆ కొబ్బరి చెట్టును పట్టుకొని బలంగా అటూ యిటూ ఊపసాగింది.ఆ కొబ్బరిచెట్టు కాయలతో నిండుగా కళకళలాడుతూ ఉంది.అంతే... పెద్దపులి ఊపులకుపైనున్న కొబ్బరికాయలు రాలి సరిగ్గా కిందున్న పెద్దపులి నెత్తిన ఢాం...ఢాం... అని వరుసగా ఓ నాలుగు ఒకదాని మీద ఒకటి పడ్డాయి. అంతే... ఆ దెబ్బకు పెద్దపులి దిమ్మతిరిగి అక్కడే దభీమని పడిపోయింది. కోతి కుందేలు నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాయి.
June 30, 2020 • T. VEDANTA SURY • Story