ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పెరటి అరటి- రామ్మోహన్ రావు తుమ్మూరి అరటి పండు అరటిపండు అందమైన అరటిపండు అందరికీ అందుబాటు ఇంటి పెరటిలోన పండు అమృతపాణి కర్పూరం ముకిరీ చక్కరకేళి కూర అరటి నార అరటి పలు రకాల కదళి ఆటలోన అరటిపండు తప్పుకు సంజాయిషీ పూజలలో అరటిపండు వాడుటానవాయితీ పాతిక పిండిపదార్థం ముప్పాతిక నీరం కలసియున్న చౌక ఫలం నిరుపేదల ఆహారం అరటి ఆకు భోజనం అత్యుత్తమ ఓగిరం అరటాకుల పందిరి పూజలలో శ్రేష్టతమం పెరటిలోన అరటి చెట్లు పెంచిచూడు నేస్తం అందం ఆనందంతో ఒనగూడును ప్రయోజనం
July 26, 2020 • T. VEDANTA SURY • Poem